Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అనుష్క భుజంపై కోహ్లీ చెయ్యి: సోషల్ మీడియాలో వైరల్

హైదరాబాద్: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్రిస్టమస్, నూతన సంవత్సర వేడుకల కోసం ఉత్తరాఖండ్ వెళ్లిన ఈ ప్రేమ జంట తమ హాలీడేని ముగించుకుని తిరిగి వ‌చ్చే స‌మ‌యంలో డెహ్రడూన్ విమానాశ్రయంలో కెమెరా కంటికి చిక్కారు.

ఎవరో అభిమాని తీసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది ఇప్పుడు వైరల్ అయింది. ఈ ఫోటోలో విరాట్ కోహ్లీ అనుష్క భుజంపై చెయ్యివేసి ఏదో మాట్లాడుతూ కనిపించారు. వీళ్లద్దరి విహారయాత్ర ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. జనవరి 1న నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలను కోహ్లీ ఖండించిన సంగతి తెలిసిందే.

ఉత్త‌రాఖండ్‌లోని న‌రేంద్ర‌న‌గ‌ర్ ఆనందా హోటల్‌లో ఈ ఇద్ద‌రి నిశ్చితార్థం జరగనున్నట్టు క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. కోహ్లీ-అనుష్క ఎంగేజ్‌మెంట్‌కు ప్ర‌ముఖులు హాజ‌ర‌వుతార‌ని చెప్పుకున్నారు. మీడియాలో వచ్చిన వార్తలన్నీ రూమర్లేనంటూ కోహ్లీ కొట్టిపారేశాడు. ఇక, న్యూ ఇయర్‌ సందర్భంగా ఈ ఇద్దరూ ట్విట్టర్‌లో అభిమానులకు శుభాకాంక్షలు చెప్పారు.

అనుష్కతో నిశ్చితార్ధంపై కోహ్లీ

అనుష్కతో నిశ్చితార్ధంపై కోహ్లీ

జనవరి 1న నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలను విరాట్ కోహ్లీ ఖండించాడు. మీడియాలో వచ్చిన వార్తలన్నీ రూమర్లేనంటూ కోహ్లీ కొట్టిపారేశాడు. ఒకవేళ తామిద్దరం నిశ్చితార్ధం చేసుకునే ఆలోచనలో ఉన్నట్లయితే అందులో దాయడానికి ఏమీ లేదని తెలిపాడు. ఆ విషయాన్ని అందిరికీ తెలియజేస్తామని, రహస్యంగా ఎంగేజ్ మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదని కోహ్లి ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.

కోహ్లీ ట్వీట్‌ని రీట్వీట్ చేసిన అనుష్క

కోహ్లీ ట్వీట్‌ని రీట్వీట్ చేసిన అనుష్క

కోహ్లీ ట్వీట్ చేసిన ట్వీట్లను అనుష్క శర్మ రీట్వీట్ చేసింది. తాము జనవరి 1న నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలు రూమర్లేనంటూ పేర్కొంది.

ఫ్యాన్స్‌కు కోహ్లీ న్యూ ఇయర్ విషెస్

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విట్టర్‌లో అభిమానులకు శుభాకాంక్షలు చెప్పాడు.

ఫ్యాన్స్‌కు అనుష్క శర్మ న్యూ ఇయర్ విషెస్

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బాలీవుడ్ నటి అనుష్క శర్మ ట్విట్టర్‌లో అభిమానులకు శుభాకాంక్షలు చెప్పింది.

ఉత్తరాఖండ్‌

ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌లో విహరిస్తుండగా ఒక అభిమానికి వీరిద్దరూ దొరికిపోయారు. ఈ సందర్భంగా ఓ గుడి పూజారి వద్ద ఈ ఇద్దరు ఆశీస్సులు తీసుకుంటుండగా అభిమాని ఒకరు ఫొటో తీసి.. సోషల్‌ మీడియాలో పెట్టారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+