Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మా చిరున‌వ్వులు అబ‌ద్ధమేమో.. కానీ మేము కాదు: కోహ్లీ

Virat Kohli-Anushka Sharma show their fake smiles in these cute selfies

ఢిల్లీ: మ‌హ‌మ్మారి కరోనా వైర‌స్ కార‌ణంగా ప్రపంచంలోని క్రీడా టోర్నీల‌న్నీ రద్దైన విషయం తెలిసిందే. ఎటువంటి టోర్నీలు లేకపోవడంతో ఆటగాళ్లు అందరూ ఇంటికే ప‌రిమిత‌మయ్యారు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఊహించ‌ని విరామాన్ని స‌తీమ‌ణి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శ‌ర్మ‌తో క‌లిసి ఆనందంగా గ‌డుపుతున్నాడు. ఇంటికే పరిమితమైన కోహ్లీ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాడు. ప్రమాదకర వైరస్‌పై ఎప్పటికప్పుడు అభిమానులకు అవగాహన కల్పిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవల పీఎం కేర్స్‌కు భారీ విరాళం అందించాడు.

ఇక సామాజిక మ‌ధ్య‌మాల్లో చురుకుగా ఉండే విరుష్క జోడి త‌మ అభిమానుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ల‌క‌రిస్తూనే ఉంది. తాజాగా గురువారం ఈ జోడీ ట్విట్ట‌ర్‌లో ఓ ఫొటో పోస్ట్ చేసింది. భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ న‌వ్వుతూ పోజిచ్చిన ఫొటోను అభిమానుల‌తో పంచుకుంది. 'మా న‌వ్వులు న‌కిలీ కావొచ్చేమో కానీ.. మేము కాదు' అని విరాట్ కోహ్లీ కాప్షన్ పెట్టాడు. లాక్‌డౌన్‌ సమయాన్ని ఎంతలా ఎంజాయ్ చేస్తున్నారో ఈ పోస్టును బట్టి అర్ధమవుతోంది.

అనుష్క శర్మ ఇంట్లో ఉంటూ.. కరోనాతో ప్రజల్లో నెలకొన్న భయాలను దూరం చేసి, ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేసింది. బుధవారం కోహ్లీ, పెంపుడు కుక్కతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఫోటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. 'కారుమబ్బులోనూ ఓ మెరుపు దాగి ఉంటుంది. ప్రస్తుతం నెలకొన్న ఈ కఠిన పరిస్థితులు మనల్ని ఆగిపోయేలా చేశాయి. తీరిక లేకుండా ఉన్నామని చెప్పుకునే పనులు చేయకుండా ఆపేశాయి. అయితే ఈ సమయాన్ని గౌరవిస్తే.. అది మనకు మరింత వెలుగుల్ని ఇస్తుంది. ఈ సమయం జీవితంలో ఏది ముఖ్యమో తెలుసుకునేలా చేసింది. ఆహారం, నీళ్లు, ఇల్లు, కుటుంబ సభ్యుల ఆరోగ్యం.. ఇవే నాకిప్పుడు ప్రధానమైనవి. మిగతావన్ని అదనంగా లభించినందుకు కృతజ్ఞతలు' అని అనుష్క శర్మ పేర్కొంది.

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా బయట నిత్యావసర దుకాణాలు మినహా మిగతావన్నీ మూసివేయడంతో విరాట్‌ కోహ్లీకి హెయిర్‌స్టైలిస్ట్‌ ఎవరూ దొరకలేదు. దీంతో కోహ్లీ హెయిర్ కట్ బాధ్యతని ఇటీవలే అనుష్క శర్మ తీసుకుంది. ఓ కత్తెర పట్టుకుని కోహ్లీ హెయిర్‌ స్టైల్‌ సెట్‌ చేసింది. నా భార్య చేసిన అందమైన హెయిర్​కట్ అని కోహ్లీ సంబరపడిపోయాడు.

Story first published: Friday, April 3, 2020, 11:16 [IST]
Other articles published on Apr 3, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+