
హైదరాబాద్: విదేశీ పర్యటనలో భాగంగా భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలోనే వరుసగా సఫారీ జట్టుపై మూడు మ్యాచ్‌లలోనూ టీమిండియా విజయాన్ని నమోదు చేసింది. రెండో వన్డేలో భాగంగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
క్రికెటర్ల ఫొటోలు, బ్యానర్లు పట్టుకుని గ్యాలరీలో అభిమానులు చేసే సందడిలో ఆసక్తికర విషయం చోటు చేసుకుంది. కానీ నిన్న భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ-అనుష్కల పెళ్లికి సంబంధించిన బ్యానర్‌తో అభిమానులు సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
టాస్ గెలిచి భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. మ్యాచ్ మధ్యలో కెప్టెన్ కోహ్లీ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్‌కు వెళ్లాడు. ఆ సమయంలో సమీపంలో ఉన్న అభిమానులు కోహ్లీ-అనుష్కల పెళ్లికి సంబంధించిన బ్యానర్‌తో కనిపించారు. శుభాకాంక్షలు తెలిపారు. అక్కడే ఉన్న కోహ్లీ వారికి ధన్యవాదాలు తెలిపాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
దక్షిణాఫ్రికా నిన్న జరిగిన రెండో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య మూడో వన్డే కేప్‌టౌన్‌లో ఫిబ్రవరి 7వ తేదీ బుధవారం జరగనుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.