న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పెళ్లైన ఏడాది తర్వాత ఎలా ఉంటుందో చెప్తోన్న విరాట్-అనుష్క(వీడియో)

Virat Kohli, Anushka Sharma’s new Manyavar ad reveals what happens after one year of marriage.

ముంబై: మూడు ముళ్ల బంధంతో ఒకటైన జంట సెలబ్రిటీలు విరాట్ కోహ్లీ.. అనుష్క శర్మ. అయితే షాంపూ యాడ్‌లో మొదలైన వీరి పరిచయం.. ప్రేమగా మారి పెళ్లికి దారి తీయగా వివాహానికి ముందు విరుష్కాలు మాన్యవార్ బట్టల కంపెనీకి ఒక యాడ్ చేశారు. అందులో పెళ్లికి ముందు ప్రేయసికి ప్రియుడు ఇస్తున్న వాగ్దానాలతో యాడ్ ముగుస్తోంది. తాజాగా మాన్యవార్ కంపెనీ మరోసారి ఈ జోడీతో యాడ్ చేసేందుకు పూనుకుంది.

ఆసాంతం లీనమైపోయే విధంగా

ఆసాంతం లీనమైపోయే విధంగా

అంతకుముందు యాడ్‌లోని సన్నివేశాలను అనుసంధానిస్తూ ప్రకటన ఆసాంతం లీనమైపోయే విధంగా చిత్రీకరించారు. కొద్ది రోజుల ముందే బాలీవుడ్ నటులు దీపికా, రణ్‌వీర్ వివాహం జరగడంతో ఇది ప్రజలకు చాలా త్వరగా కనెక్ట్ అవుతోంది.

కొత్త యాడ్‌ చిత్రీకరించిన మాన్యవర్:

విరుష్కా జోడి మరోసారి కనిపించిన మాన్యవర్ యాడ్‌ ఎలా ఉందంటే.. సాధారణంగా పెళ్లికి ముందు ఉన్న ప్రేమ పెళ్లయిన ఏడాది తర్వాత ఉండదంటారు. దీనిపై ఎన్నో జోకులు కూడా పేలుతుంటాయి. సరిగ్గా ఇదే కాన్సెప్ట్‌తో ఈ కొత్త యాడ్‌ను కూడా చిత్రీకరించారు. పెళ్లికి ముందు చేసిన వాగ్దానాలను ముందు చూపించి.. ఏడాది తర్వాత పరిస్థితి ఇదీ అంటూ కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న జంటను విరుష్క భయపెడుతున్నట్లుగా ఈ యాడ్‌ను షూట్ చేశారు.

ఎల్లప్పుడూ నిన్ను కాపాడుకుంటా

ఏడాది క్రితం యాడ్‌లో 'హమేశా ఖయాల్ రఖుంగా' (ఎల్లప్పుడూ నిన్ను కాపాడుకుంటా) అని కోహ్లీ అంటే అనుష్క భావోద్వేగానికి గురై 'మై బీ'(నేను కూడా) అంటుంది. ప్రస్తుతం యాడ్‌లో కోహ్లీ.. అనుష్కలు కలిసి వివాహానికి హాజరై పెళ్లికొడుకు.. కూతురుతో ముచ్చటిస్తుంటారు. ముందుగా అనుష్క నెలలో 15 రోజులు వంట నీతో చేయించి తన వంతైన మిగతా 15 రోజులు ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తాడంటూ పెళ్లికూతురుకి చెప్తూ ఉంటుంది.

ప్రేమ ఎప్పుడూ పెరుగుతూనే

ప్రేమ ఎప్పుడూ పెరుగుతూనే

'అది విన్న విరాట్.. కౌంటర్‌గా పెళ్లి కొడుక్కి.. వివాహానికి ముందే అంతా.. తర్వాత ఏదీ నీ చేతుల్లో ఉండదు. రిమోట్ తన చేతుల్లో పెట్టుకుని ఆడిస్తూ ఉంటుంది.' అని చెప్తాడు. ఆ తర్వాత పెళ్లి కొడుకు.. కూతురులను ఉద్దేశించి పెళ్లి అయిన ప్రతీసారి గొడవ ఉంటుంది. అలా ఎప్పుడూ ప్రేమ పెరుగుతూనే ఉంటుంది. అని కాస్త ఎమోషనల్‌గా ముగించడం ఆకట్టుకుంది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Story first published: Tuesday, November 20, 2018, 15:42 [IST]
Other articles published on Nov 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X