Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందరి కళ్లు 'విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ'ల ముంబై రిసెప్షన్‌పైనే!

హైదరాబాద్: ముంబైలోని లోయర్ పరేల్‌లో విలాసవంతమైన రిజిస్‌ హోటల్‌లోని 9వ లెవల్‌లో ఉన్న ఆస్టర్‌ బాల్‌రూమ్‌లో బాలీవుడ్ ప్రముఖులతో పాటు టీమిండియాకు విరాట్ కోహ్లీ-అనుష్క శర్మలు మంగళవారం రిసెప్షన్ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

డిసెంబరు 11న ఇటలీలో వివాహం

డిసెంబరు 11న ఇటలీలో వివాహం

డిసెంబరు 11న ఇటలీలోని టస్కనీలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి అనంతరం వీరిద్దరూ అటు నుంచి అటే హనీమూన్‌ కోసం ఫిన్‌లాండ్‌ వెళ్లారు. హనీమూన్ అనంతరం భారత్‌కు వచ్చిన ఈ జోడీ రాజధాని ఢిల్లీలో ఘనంగా రిసెప్షన్ ఇచ్చారు. ఈ రిసెప్షన్‌కు ప్రధాని మోడీతో పాటు పలువురు క్రికెటర్లు హాజరయ్యారు. పంజాబ్‌ సింగర్ గురుదాస్‌ మాన్‌తో ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమంలో కోహ్లీ-అనుష్కల జోడీ చేసిన డ్యాన్స్ అందరినీ అలరించింది. ఇక, ఈ రిసెప్షన్‌కు ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ సవ్యసాచి ముఖర్జీ ప్రత్యేకంగా రూపొందించిన సంప్రదాయ వస్త్రాలు కోహ్లీ-అనుష్కల జోడీ మెరిసిపోయింది.

ముంబైలో రెండో వివాహ విందుకు సిద్ధమైన విరుష్క జోడీ

ముంబైలో రెండో వివాహ విందుకు సిద్ధమైన విరుష్క జోడీ

ఇప్పుడు కోహ్లీ-అనుష్కల జోడీ రెండో వివాహ విందుకు సిద్ధమయ్యారు. దీంతో అందరి దృష్టి వీరిద్దరూ ముంబైలో ఇచ్చే రిసెప్షన్‌పై పడింది. ఢిల్లీ రిసెప్షన్‌కు అందమైన దుస్తుల్లో మెరిసిన వీరిద్దరూ ఈ వివాహ విందులో ఎలాంటి డిజైనర్‌ దుస్తులు ధరిస్తారనే చర్చ అభిమానుల్లో ఇప్పటికే మొదలైంది. ఈ విందులో అటు క్రికెట్ రంగానికి చెందిన ప్రముఖులతో పాటు బాలీవుడ్‌కు చెందిన పలువురు హాజరుకానున్నారు. ముంబైలోని లోయర్‌ పరేల్‌లో ఉన్న సెయింట్‌ రిజిస్‌ హోటల్‌లోని 9వ లెవల్‌లో ఉన్న ఆస్టర్‌ బాల్‌రూమ్‌లో ఈ విందు కార్యక్రమం జరగనుంది. 395 గెస్ట్‌ రూమ్‌లు కలిగి ఉన్న ఈ హోటల్‌లో 27 సూట్స్‌, 39 రెసిడెన్షియల్‌ సూట్స్‌ అందుబాటులో ఉన్నాయి.

వివాహ విందు రాత్రి 8.30 గంటలకు

వివాహ విందు రాత్రి 8.30 గంటలకు

ఇటీవలే జహీర్‌ ఖాన్‌-సాగరికల రిసెప్షన్ కూడా ఇక్కడే జరగడం విశేషం. ముంబైలో కోహ్లీ-అనుష్కలు ఇచ్చే రిసెప్షన్‌కు హాజరు కావాలని కోరుతూ ఇప్పటికే అతిథులకు ఆహ్వాన పత్రికలు వెళ్లాయి. ఈ ఆహ్వాన పత్రికలో కూడా విరుష్క జోడీ తన ప్రత్యేకతను చాటుకున్నాయి. ఆహ్వాన పత్రికతో పాటు స్వీట్లు, చిన్న మొక్క కూడా అతిథులకు అందించారు. ఈ ఆహ్వాన పత్రికకు సంబంధించిన ఫోటోలను బాలీవుడ్‌ డైరెక్టర్‌ కునాల్‌ కోహ్లీ తన ట్విటర్‌‌లో అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. ఆస్టర్‌ టెర్రస్‌పై రాత్రి 8.30 గంటలకు ఈ వివాహ విందు ప్రారంభం కానుంది.

అతిథుల జాబితాలో ఎవరెవరు?

అతిథుల జాబితాలో ఎవరెవరు?

ఈ వివాహ విందుకు అతిథుల్లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ దంపతులు, ముకేశ్ అంబానీ దంపతులు, బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ దంపతులు, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ దంపతులు, కరణ జోహార్, కత్రినా కైఫ్, యశ్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రాలతో పాటు క్రికెటర్లు మహేంద్ర సింగ్‌ ధోనీ, రోహిత్‌ శర్మతో పాటు కోచ్‌ రవిశాస్త్రి తదితరులు హాజరుకానున్నారు. ఈ విందు కార్యక్రమం అనంతరం దక్షిణాఫ్రికా పర్యటనకు కోహ్లీసేన బయల్దేరనుంది. కోహ్లీతో పాటు అనుష్క కూడా దక్షిణాఫ్రికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరూ కొత్త సంవత్సరాన్ని అక్కడే సెలబ్రేట్‌ చేసుకుంటారని సమాచారం.

Story first published: Tuesday, December 26, 2017, 16:58 [IST]
Other articles published on Dec 26, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+