జనవరి 1న కోహ్లీ, అనుష్క ఎంగేజ్‌మెంట్!: హాజరుకానున్న బిగ్‌బి, అంబానీలు
హైదరాబాద్: ఇన్నాళ్లు ప్రేమ పక్షులుగా ఉన్న టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ తమ లవ్ స్టోరీకి పుల్ స్టాప్ పెట్టి ఓ ఇంటివారు కానున్నారు. ఈ న్యూయర్ ఇయర్ రోజున ఈ ఇద్దరూ ఎంగేజ్‌మెంట్‌కి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరిస్ ముగిసిన తర్వాత కోహ్లీ తన ప్రేయసి అనుష్క శర్మతో కలిసి నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు ఉత్తరాఖండ్ విహారయాత్రలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట.

ఇందులో భాగంగా జనవరి 1వ తేదీన ఈ ఇద్దరూ ఎంగేజ్‌మెంట్‌కి సిద్ధమవడంతో ఆ దిశగా ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్‌లోని నరేంద్రనగర్ ఆనందా హోటల్‌లో ఈ ఇద్దరి నిశ్చితార్థం జరిగే అవకాశం ఉంది. కాగా, దీనిపై కోహ్లి కానీ, అనుష్క శర్మ కానీ ఎటువంటి ప్రకటనా చేయలేదు. క్రిస్టమస్, న్యూయ ఇయర్ వేడుకల కోసం ఈ ప్రేమపక్షులు గత ఆదివారం ఉత్తరాఖండ్ వెళ్లిన సంగతి తెలిసిందే.
అక్కడి నుంచే వీరిద్దరూ తమ తమ ఇనిస్టాగ్రామ్‌లలో పోస్టు చేస్తున్నారు. అయితే వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను మాత్రం పోస్టు చేయక పోవడం విశేషం. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో విహరిస్తుండగా ఒక అభిమానికి వీరిద్దరూ దొరికిపోయారు. ఈ సందర్భంగా ఓ గుడి పూజారి వద్ద ఈ ఇద్దరు ఆశీస్సులు తీసుకుంటుండగా అభిమాని ఒకరు ఫొటో తీసి.. సోషల్ మీడియాలో పెట్టారు.
ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇక క్రిస్టమస్ శుభాకాంక్షలు చెబుతూ మెడలో రుద్రాక్షమాల వేసుకుని ఓ సెల్ఫీ దిగి అభిమానుల కోసం ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.
మరోవైపు కోహ్లీ-అనుష్క ఎంగేజ్‌మెంట్‌కు ప్రముఖులు హాజరవుతున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. బాలీవుడ్‌తో పాటు పలువరు క్రికెటర్లు సైతం ఈ వేడుకకు హాజరవుతున్నట్లు సమాచారం.

ఇందులో భాగంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో పాటు అంబానీ కుటుంబ సభ్యులు ఉత్తరాఖండ్‌కు చేరుకున్నారు.

అనుష్క స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇప్పటికే అక్కడికి చేరుకొని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని తెలుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications