అంగరంగ వైభవంగా కోహ్లీ అనుష్కల పెళ్లి విందు, ముఖ్య అతిథిగా ప్రధాని( ఫొటోలు)
హైదరాబాద్: అటు అభిమానుల నుంచి ఇటు మీడియా వరకు ఎవ్వరికీ అందకుండా సుదూర ప్రయాణం చేసి విదేశాల్లో ఒక్కటైన ప్రేమజంట విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ. ఇటలీలో వివాహం అనంతరం అటునుంచి అటే హనీమూన్‌కు రోమ్‌కు చెక్కేశారు.


వారు పిలిస్తే రాకుండా ఎలా
రెండ్రోజులు ముందు ఢిల్లీలోని తన స్వగృహానికి శ్రీమతిని తీసుకుని వచ్చిన విరాట్ రిసెప్షన్ ఏర్పాట్లు చూసుకున్నాడు. ఈ జంట ప్రధాని నరేంద్ర మోడీని స్వయంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఇద్దరూ టాప్ సెలబ్రిటీలు, అందులో టీమిండియా కెప్టెన్ పిలిస్తే రాకుండా ఉంటారా.. వీలు చేసుకుని వేడుకకు పయనమయ్యారు.
అంగరంగ వైభవంగా చేసిన ఏర్పాట్లు
రిసెప్షన్ వేడుకను హోటల్ తాజ్ ప్యాలస్‌లో ఏర్పాటు చేశారు. అంగరంగ వైభవంగా చేసిన ఏర్పాట్లకు ప్రధానితో సహా బంధు మిత్రులు సైతం ఆశ్చర్యానికి గురైయ్యారు. వేడుకలో కోహ్లీ, అనుష్కలు సంప్రదాయ దుస్తుల్లో హాజరైయ్యారు. వారి వేషాధారణే ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

మళ్లీ ఇంకోసారి
రిసెప్షన్ వేడుకను రెండు దఫాలుగా నిర్ధేశించిన విరాట్ డిసెంబరు 26న మరోసారి ముంబైలో జరపనున్నాడు. ఆ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు, క్రికెటర్లకు మరో విందు రానున్నారు. శ్రీలంకతో జరిగే చివరి టీ20 మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు.. ఈ విందులో పాల్గొంటారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications