

హైదరాబాద్: మరో 24 గంటల్లో టెస్టు సిరీస్ ప్రారంభమవుతుందనగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన సతీమణితో షాపింగ్ చేస్తూ.. కెమెరా కంటికి చిక్కాడు. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే భారత జట్టు తీవ్రంగా కసరత్తులు చేసింది. కెప్టెన్ కోహ్లీ.. స్పోర్ట్స్ దుస్తుల్లోనే సతీసమేతంగా షాపింగ్‌కు వెళ్లాడు. మాల్‌లోని ఓ వ్యక్తి వారిద్దరినీ ఫొటోలు, వీడియో తీసి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.
గత ఇంగ్లాండ్ పర్యటన 2014లో అంతగా రాణించలేకపోయాడు. అప్పటి కెప్టెన్ ధోనీ నేతృత్వంలో టీమిండియా ద్వైపాక్షిక సిరీస్ ఆడి ఒక సిరీస్ గెలుచుకుని మరో సిరీస్‌ను ఓడిపోయింది. కాగా, అప్పటి ఫలితాలను తిరగరాయాలనే ప్రయత్నంలో కోహ్లీ కసిగా ఎదురుచూస్తున్నట్లు పలువురు పేర్కొంటున్నారు.
అప్పటి పర్యటనలో అండర్సన్ కోహ్లీకి తెలివిగా బౌలింగ్ చేసి వికెట్లు తీశాడు. ఆ పర్యటన తర్వాత 3 విదేశీ పర్యటనలలో పాల్గొన్న కోహ్లీ లోపాలను సరిచేసుకుని చక్కగా రాణిస్తున్నాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇప్పటికే రెండో స్థానంలో కొనసాగుతున్నాడు కోహ్లీ. బాల్ ట్యాంపరింగ్ ద్వారా ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు స్మిత్ దూరం కావడంతో.. కోహ్లీకి నంబర్ వన్ ర్యాంకు దక్కేందుకు చాలా మంచి అవకాశం దక్కింది.
చక్కటి జట్టుతో ఉండటమూ ప్రధాన సమస్యగా మారింది టీమిండియాకు. ఈ నేపథ్యంలో జట్టులో బౌలింగ్‌లో కుల్దీప్, రవీంద్ర జడేజా, అశ్విన్, షమీలలో తుది జట్టులో ఎవరినీ ఎంచుకోవాలో అని.. ఓపెనర్‌గా ఎవరినీ తీసుకోవాలని టీమిండియా మేనేజ్‌మెంట్ తర్జనభర్జనలు పడుతోంది.