Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కేప్ టౌన్‌లో కోహ్లీ-అనుష్కల షాపింగ్ సందడి

Virat Kohli, Anushka Sharma go shopping in Cape Town, South Africa

హైదరాబాద్: విరుష్క జోడీ దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో షాపింగ్‌ చేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను దేవేంద్ర పాండే అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ కోసం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆదివారం ప్రాక్టీస్‌ సెషన్స్‌ అనంతరం విరాట్ కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మతో కలిసి షాపింగ్‌కు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జనవరి 5న ప్రారంభంకానుంది.

న్యూ ఇయర్ వేడుకల కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లిన అనుష్క శర్మ తిరిగి భారత్‌కు వచ్చి జనవరి నుంచి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొననుంది. డిసెంబర్ 11న ఇటలీలోని టస్కనీలో వీరి పెళ్లి కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.

అనంతరం ఢిల్లీ, ముంబైలో అటు బాలీవుడ్‌తో పాటు ఇటు క్రికెటర్లకు వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వివాహ విందు కార్యక్రమం అనంతరం డిసెంబరు 27న కోహ్లీ సేన దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరింది. దక్షిణాఫ్రికా పర్యటనలో క్రికెటర్లు తమ ఫ్యామిలీతో కలిసి వెళ్లిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, January 1, 2018, 12:47 [IST]
Other articles published on Jan 1, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+