
డిసెంబర్‌లో కోహ్లీ-అనుష్క శర్మల వివాహం
డిసెంబరులో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుందని తెలుస్తోంది. అయితే దీనిపై ఇరు కుటుంబ సభ్యుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు గత కొన్నేళ్లుగా ప్రేములో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. 2015లో వీరిద్దరి మధ్య లవ్ బ్రేకప్ అయిందన్న వార్తలు కూడా అప్పట్లో హల్‌చల్ చేశాయి.

నవంబర్‌లో నెలలో భారత పర్యటనకు లంక
అయితే అలా జరగలేదు. కాగా, నవంబర్ నెలలో శ్రీలంక జట్టు మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు గాను భారత పర్యటనకు వస్తోంది. తాజాగా ఈ వార్త బయటకు రావడంతో కోహ్లీ ఈ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్న విషయం తెలియరాలేదు.

విశ్రాంతి కల్పించమని బీసీసీఐని కోరిన కోహ్లీ
వ్యక్తిగత కారణాల వల్ల డిసెంబర్ నెలలో క్రికెట్ నుంచి విశ్రాంతి కల్పించమని కోహ్లీ బీసీసీఐని కోరిన సంగతి తెలిసిందే. దీంతో పెళ్లి కోసమే కోహ్లీ విశ్రాంతి అడిగాడని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవలే వీరిద్దరూ కలిసి ఓ యాడ్ ఫిల్మ్‌లో నటించారు. ఈ యాడ్ నెటిజన్లను సైతం ఎంతగానో ఆకట్టుకుంది.

ఐపీఎల్ నుంచి విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతున్న కోహ్లీ
'ఐపీఎల్ నుంచి కోహ్లీ విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. కోహ్లీకి విశ్రాంతి ఇవ్వాలి. రొటేషన్ విధానంలో భాగంగా శ్రీలంకతో టెస్టు సిరీస్ అనంతరం కోహ్లీకి విశ్రాంతి ఇవ్వాలనే అంశాన్ని పరిశీలిస్తున్నాం' అని సోమవారం కివీస్‌తో జరగబోయే టీ20 సిరిస్‌కు జట్టుని ప్రకటించిన సమయంలో టీమిండియా ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











