ఏనుగుల జలకాలాట: వాగులో సందడి చేసిన కోహ్లీ, అనుష్క
హైదరాబాద్: ఆతిథ్య శ్రీలంకపై వరుస విజయాలను నమోదు చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పుల్ జోష్‌లో ఉన్నాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన కోహ్లీసేన తాజాగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
లంక పర్యటనలో ఉన్న కోహ్లీకి తోడుగా ప్రేయసి అనుష్క శర్మ కూడా అక్కడే ఉండటంతో మ్యాచ్‌లు లేని తీరిక సమయాల్లో వీరిద్దరూ శ్రీలంకలోని పర్యాటక ప్రాంతాల్లో చక్కర్లు కొడుతున్నారు. తాజాగా ఓ వాగులో ఏనుగులు జలకాలాట ఆడుతున్న దృశ్యాన్ని తాను ఎంజాయ్ చేస్తున్నట్లు కోహ్లీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
మరోవైపు అనుష్క శర్మ కూడా అలాంటి ఫొటోల్నే తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేయడంతో పాటు కీలకమైన రనౌట్ చేసి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా రెండో వన్డే ఆగస్టు 24 (గురువారం)న పల్లెకలె వేదికగా జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications