Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైరల్ వీడియో.. ఇంట్లోనే ఆటాడుకున్న కోహ్లీ, అనుష్క!!

Virat Kohli, Anushka Sharma engage in light cricket knocking session

ఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్‌ కారణంగా ప్రస్తుతం దేశంలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎటువంటి టోర్నీలు లేకపోవడంతో ఆటగాళ్లు అందరూ ఇంటికే ప‌రిమిత‌మయ్యారు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఊహించ‌ని విరామాన్ని బాలీవుడ్ నటి, సతీమణి అనుష్క శ‌ర్మ‌తో క‌లిసి ఆనందంగా గ‌డుపుతున్నాడు. అయితే సోషల్‌మీడియా ద్వారా విరాట్, అనుష్కలు తమకు సంబంధించిన విషయాలను పంచుకుంటున్నారు.

ఇంటి ఆవరణలో క్రికెట్:

ఇంటి ఆవరణలో క్రికెట్:

ప్రమాదకర కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లాక్‌డౌన్‌లో పాటించాల్సిన నిబంధనల గురించి ప్రజల్లో అప్రమత్తం కలిగేలా విరుష్క జోడి వీడియోలు తీసి షేర్ చేస్తున్నారు. అయితే విరుష్కకు సంబంధించిన తాజాగా ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో కోహ్లీ, అనుష్కలు తమ ఇంటి ఆవరణలో క్రికెట్ ఆడారు. ఆ తర్వాత కోహ్లీ తన గ్లోవ్స్ ధరించి బ్యాటింగ్‌కి దిగుతాడు. విరాట్‌కి అనుష్క బౌన్సర్ వేయగా.. ఇండియన్ కెప్టెన్ డిఫెన్స్ చేసాడు.

చాలా కాలం తర్వాత విరాట్ బ్యాటింగ్:

విరుష్క క్రికెట్ ఆడుతుండగా.. పక్క బిల్డింగ్‌లోని వారు వీడియో తీశారు. వీడియోలో విరుష్కతో పాటు మరొకరు కూడా ఉన్నారు. అతడు కీపింగ్ చేసాడు. ప్రస్తుతం విరుష్క జోడి క్రికెట్ ఆడిన ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. చాలా కాలం తర్వాత విరాట్ బ్యాటింగ్ చేయడం చూశామంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. విరుష్క జోడీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అనుష్కపై ప్రశంసల జల్లు:

అనుష్కపై ప్రశంసల జల్లు:

సతీమణి అనుష్క శర్మ నిర్మించిన 'పాతాళ్‌ లోక్‌ సీజన్‌ 1' వెబ్‌ సిరీస్‌కు విరాట్‌ కోహ్లీ రివ్యూ ఇచ్చాడు. అనుష్క రూపొందించిన ఈ సస్పెన్స్‌ క్రైమ్‌ థిల్లర్‌ ఎంతో అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. కథ, స్క్రీన్‌ప్లేతో పాటు నటులు కూడా చాలా అద్భుతంగా నటించారన్నాడు. ఈ వెబ్‌ సిరీస్‌ సీజన్‌ మొత్తం చూసానని చెప్పిన కోహ్లీ.. ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వస్తోందన్నాడు. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైన ఈ వెబ్‌సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తున్న సంగతి తెలిసిందే.

ఇటలీలో వివాహం:

ఇటలీలో వివాహం:

'నిజాయతీగా చెప్పాలంటే అనుష్క శర్మతో ప‌రిచ‌యం నాలో చాలా మార్పుల‌కు కార‌ణ‌మైంది. గ‌తంలో నేను ప్ర‌తీ చిన్న విష‌యానికి కొప్ప‌డేవాడిని. తీవ్ర అసహనానికి గురయ్యేవాడిని. ఇప్పుడు ఆ ధోర‌ణి మారింది. అనుష్క నాలో శాంత‌న్ని నింపింద‌నుకుంటా. అనుష్క వ్యక్తిత్వం, ఎలాంటి పరిస్థితులలో ఉన్నా ఆమె ప్రశాంతంగా ఉండడం నిజంగా నన్ను ప్రేరేపించింది' అని కోహ్లీ గతంలో తెలిపాడు. విరుష్క జోడీ 2013లో ఓ షాంపూ ప్రకటన కోసం చేసిన చిత్రీకరణలో మొదటిసారి కలుసుకున్నారు. 2017, డిసెంబర్ 11 విరాట్-అనుష్క ఇటలీలో వివాహం చేసుకున్నారు.

Story first published: Saturday, May 16, 2020, 20:01 [IST]
Other articles published on May 16, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+