కోహ్లీ-అనుష్క దీపావళి సెలెబ్రేషన్స్.. ఫొటోలు చూస్తే నోరేళ్లబెట్టాల్సిందే!!

ముంబై: దేశ వ్యాప్తంగా ప్రజలందరూ ఆదివారం నాడు దీపావళి పండగను ఘనంగా జరుపుకున్నారు. భారత క్రికెటర్లు, మాజీలు అందరూ కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తన సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి దీపావళి వేడుకను ఘనంగా జరుపుకున్నారు. ముంబైలోని తన నివాసంను అంగరంగ వైభవంగా ముస్తాబు చేసి.. దీపాలతో వెలుగులు నింపాడు.

అనుష్కతో కోహ్లీ ఫొటోలు:
దీపాలతో ఇంటిని అందంగా అలంకరించిన తర్వాత అనుష్కతో కలిసి కోహ్లీ ఫొటోలు దిగారు. ఫోటోలను కోహ్లీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. తెల్ల దుస్తుల్లో కోహ్లీ, లెహెంగాలో అనుష్క అందరినీ ఆకర్షిస్తున్నారు. ఈ ఫొటోలు చూసిన అభిమానులు మురిసిపోతున్నారు. కోహ్లీ అందరికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. 'మీకు, మీ కుటుంబానికి మా దీపావళి శుభాకాంక్షలు. ఈ వెలుగును ఎల్లప్పుడూ మీకు ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను' అని కోహ్లీ రాసుకొచ్చాడు. 'హోమ్-స్వీట్ హోమ్' అని ఓ ఫొటోలో ఉంచారు.

సూపర్ జోడి:
మరోవైపు అనుష్క శర్మ కూడా తన ట్వీటర్ ఖాతాలో మరికొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. ప్రస్తుతం కోహ్లీ-అనుష్క దీపావళి సెలెబ్రేషన్స్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు ఈ ఫొటోలపై కామెంట్ల వర్షం కురుస్తూ.. దీపావళి శుభాకాంక్షలు తెలియయజేస్తున్నారు. 'సూపర్ జోడి.. దీపావళి శుభాకాంక్షలు' అని ఓ అభిమాని ట్వీట్ చేయగా.. 'దీపావళి శుభాకాంక్షలు విరుష్క' అని మరో అభిమాని ట్వీట్ చేసాడు.

టీ20 సిరీస్‌కు దూరం:
ప్రపంచకప్ అనంతరం తీరిక లేకుండా క్రికెట్ ఆడుతున్న కోహ్లీ.. నవంబర్ 3నుంచి బంగ్లాదేశ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు దూరంగా ఉండడనున్నాడు. కోహ్లీ స్థానంలో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు బాధ్యతలు అందుకోనున్నాడు. బంగ్లాదేశ్‌తో నవంబర్ 14 నుండి జరిగే తొలి టెస్టుకు కోహ్లీ జట్టుతో చేరతాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో కోహ్లీ ఇప్పుడే విశ్రాంతి తీసుకుంటున్నాడని సమాచారం తెలుస్తోంది.

నాన్నే నా సూపర్ హీరో:
'మా నాన్న ఈ లోకంలో ఉన్నంతకాలం నా సూపర్ హీరో. చాలా మంది మనకు స్ఫూర్తి, ప్రేరణనిస్తారు. కానీ ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తూ స్ఫూర్తి, ప్రేరణ కలిగించడం వేరు. నాకు నాన్న ప్రత్యక్ష ఉదాహరణగా ఉంటూ ఎంతో ప్రేరణనిచ్చారు. నా ఆదర్శం మా నాన్న. నాన్న ప్రభావం నాపై చాలా ఉంది. సొంత కష్టంతోనే ముందుకు సాగాలని, మరో మార్గం లేదని నాకు ఆయన వ్యక్తిత్వం వల్లే అర్థమైంది. దానిపైనే ఎక్కువగా దృష్టి సారించా. నాన్న నిర్ణయాల వల్లే నా కెరీర్ సులభంగా సాగింది. అందుకే ఆయనే నా సూపర్ హీరో' అని కోహ్లీ తాజాగా తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications