Teamindia Final: 'గెలిచేశాం..' - గ్రౌండ్‌లో కోహ్లీ,అనుష్క శర్మ సెలబ్రేషన్స్ (వీడియో వైరల్)
తాజాగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లింది టీమిండియా. ఈ విజయంతో భారత జట్టు ఆటగాళ్లంతా ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ విజయంతో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (98 బంతుల్లో 84; 5x4) సూపర్ ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
అయితే కోహ్లీ ఆడే ముఖ్యమైన మ్యాచ్ లకు కోహ్లీ భార్య అనుష్క శర్మ హాజరై, భర్తను ప్రోత్సాహిస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలా మ్యాచుల్లో వీరిద్దరి జోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటుంది. తమ చర్యలతో వీరిద్దరూ అభిమానులను ఆకట్టుకుంటుంటారు. తాజాగా జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే జరిగింది.

మ్యాచ్ విజయం సాధించిన తర్వాత కోహ్లీ.. బౌండరీ లైన్ దగ్గర నుంచి తన ఆనందాన్ని స్టాండ్స్ లో ఉన్న అనుష్కతో పంచుకున్నాడు. మనం గెలిచేశాం అంటూ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు విరాట్. అనుష్క కూడా చప్పట్లతో కోహ్లీని అభినందించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను అభిమానులు చూసి నెట్టింట తెగ షేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
Virat Kohli's reaction to Anushka Sharma after the Victory🥹🧿❤️ pic.twitter.com/wKCG9beLgX
— Virat Kohli Fan Club (@Trend_VKohli) March 4, 2025
రీసెంట్ గా కూడా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ బాది ఆకట్టుకున్నాడు విరాట్ కోహ్లీ. అప్పుడు విరాట్ ఫొటోను ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేసి అనుష్క శర్మ. లవ్, హైఫై ఎమోజీలను జత చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications