Virat Kohli : భార్యతో కలిసి ఆశ్రమానికి వెళ్లిన కోహ్లీ.. ఇప్పుడు ఎక్కడున్నాడంటే?

సూపర్ ఫామ్‌లో ఉన్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ రెండింట్లో అద్భుతంగా రాణించిన అతను.. ఇప్పుడు ఆటకు దూరంగా తన భార్య, నటి అనుష్క శర్మతో కలిసి క్వాలిటీ టైం ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి ఒక ఆశ్రమానికి కూడా వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

టీ20 ప్రపంచకప్‌లో సూపర్ షో
ఆసియా కప్ టోర్నీకి ముందు నెలరోజులపైగా ఆటకు దూరంగా ఉండి రెస్ట్ తీసుకున్న విరాట్ కోహ్లీ.. పునరాగమనంలో చెలరేగుతున్నాడు. ఆసియా కప్‌లో అద్భుతంగా రాణించాడు. కానీ ఆ టోర్నీ ఫైనల్ చేరడంలో టీమిండియా ఫెయిలయింది. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్‌లో కూడా కోహ్లీనే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కానీ సెమీఫైనల్‌లో ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిన భారత్ ఇంటి దారి పట్టింది. ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌పై 82 పరుగులతో అజేయంగా నిలిచిన కోహ్లీ.. జట్టును ఒంటిచేత్తో గెలిపించిన సంగతి తెలిసింది. ఆ తర్వాత మరో మూడు హాఫ్ సెంచరీలు చేశాడీ స్టార్ బ్యాటర్.

కివీస్ టూర్‌కు దూరం
ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించిన విరాట్ కోహ్లీని న్యూజిల్యాండ్ సిరీస్‌కు దూరం పెట్టాలని బీసీసీఐ సెలెక్టర్లు భావించారు. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ముగ్గురికీ విశ్రాంతి ఇస్తున్నట్లు ప్రకటించారు. న్యూజిల్యాండ్‌కు యువ జట్టును పంపించారు. దీంతో కోహ్లీ నేరుగా స్వదేశానికి వచ్చేశాడు. ముంబై చేరుకొని భార్యతో కలిసి సమయం గడుపుతున్నాడు.

భార్యతో కలిసి టూర్
భార్య అనుష్కతో కలిసి టైం గడుపుతున్న విరాట్ కోహ్లీ.. ఉత్తరాఖండ్ టూర్‌కు వెళ్లాడు. ఆటకు దూరంగా ఉంటూ ఇక్కడ కొన్ని దేవాలయాలను సందర్శించాడు. ఈ క్రమంలోనే నైనిటాల్‌లోని 'నీమ్ కరోలీ బాబా' ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ తమ అభిమానులతో ముచ్చటించారు. ఇలా ఫ్యాన్స్‌తో కోహ్లీ తీసుకున్న కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. క్రికెట్‌కు దూరంగా కోహ్లీ ఇలా టైం గడుపుతాడా? అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications