Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsBAN: ఇది కదరా టెస్టు క్రికెట్ అంటే.. కోహ్లీ, సిరాజ్‌ చేసిన పనిపై ఫ్యాన్స్ కామెంట్స్

Virat Kohli and Siraj cheeky send off to litton das goes viral

టెస్టు క్రికెట్ అంటే ఏంటి? ఇంగ్లండ్ జట్టు కొత్తగా 'బాజ్ బాల్' విధానం అమలు చేయడం మొదలు పెట్టిన తర్వాత క్రికెట్ అభిమానులను అయోమయానికి గురి చేస్తున్న ప్రశ్న ఇది. టెస్టు స్పెషలిస్టు ఛటేశ్వర్ పుజారా ఆడినట్లు నిదానంగా పరుగులు చేయడమే టెస్టు క్రికెటా? లేక ఇంగ్లండ్ బ్యాటర్లలా దుమ్ము దులపడమా? అని తీవ్రంగా చర్చ జరుగుతోంది. అయితే ఇవేమీ కాదంటూ మైదానంలో ఆటగాళ్ల యాటిట్యూడ్ టెస్టు క్రికెట్‌కు మూలం అంటున్నారు టీమిండియా ఫ్యాన్స్.

సిరాజ్‌ vs లిటాన్ దాస్

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు లోయర్ ఆర్డర్ సాయంతో భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదన కోసం బరిలో దిగిన ఆ జట్టును టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్ ఆరంభంలోనే దెబ్బకొట్టారు. ఈ నేపథ్యంలో రెండో రోజు ఆట మధ్యలో జరిగిన ఒక ఘటన వైరల్‌గా మారింది. అప్పటికే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో బంగ్లాను ఆదుకోవడానికి ఆ జట్టు స్టార్ ప్లేయర్ లిటాన్ దాస్ ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో సిరాజ్ వేసిన బంతిని ఫీల్డర్ వైపు ఆడాడు. అప్పుడు ఏం జరిగిందో తెలియదు కానీ.. సిరాజ్ అన్న ఏవో మాటలు దాస్‌ను ఇరిటేట్ చేశాయి.

కోహ్లీ ఊరుకుంటాడా?

'ఏంటి? ఏమన్నావ్? నాకు వినపడలేదు. వినిపించేలా మళ్లీ చెప్పు' అంటూ చెవి వద్ద చెయ్యి పెట్టుకుంటూ కొంత ఎక్స్‌ట్రాలు చేశాడు. ఈ గొడవ పెద్దది కాకముందే అంపైర్లు కలగజేసుకొని ఇద్దరినీ వారి స్థానాలకు పంపేశాడు. అయితే ఆ మరుసటి బంతికే దాస్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో సిరాజ్ తన సిగ్నేచర్ స్టైల్‌లో నోటిపై వేలు పెట్టుకొని సెలబ్రేట్ చేసుకున్నాడు. కానీ కథ అక్కడితో ముగియలేదు. ఇదంతా ఫీల్డ్‌లో ఉన్న కోహ్లీ చూస్తూనే ఉన్నాడు. సాధారణంగానే మైదానంలో ఎగ్రెసివ్‌గా ఉండే కోహ్లీ.. టెస్టు క్రికెట్‌లో మరో స్థాయిలో ఎగ్రెసివ్‌నెస్ చూపిస్తుంటాడనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి కోహ్లీ ముందే టీమిండియా పేసర్‌ను తక్కువ చేస్తే అతను ఎందుకు ఊరుకుంటాడు చెప్పండి.

అదిరిపోయే సెండాఫ్

క్లీన్ బౌల్డ్ అవడంతో నిరాశగా వెళ్తున్న దాస్‌ను ఎగతాళి చేసిన కోహ్లీ.. అతను చెప్పే మాటలు తనకు వినిపించనట్లు చెవిపై చెయ్యి పెట్టుకొని విన్నాడు. అంతకుముందు దాస్ కూడా సిరాజ్ విషయంలో అలాగే చేశాడుగా మరి. అది చూసిన సిరాజ్ తను కూడా చెవి దగ్గర చెయ్యిపెట్టుకొని దాస్‌కు సెండాఫ్ ఇచ్చాడు. అంతకుముందే తమ ఆటగాడితో గొడవకు దిగిన బ్యాటర్.. మరుసటి బంతికే క్లీన్ బౌల్డ్ అయితే అభిమానులు సైలెంట్‌గా ఎందుకుంటారు? స్టేడియం మొత్తం దద్దరిల్లేలా అరుస్తూ తాము కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇదంతా చూసిన నెటిజన్లు కూడా సంతోషంతో ఊగిపోయారు. 'బాజ్ బాల్ లేదు.. ఏం లేదు. ఇది కదా అసలు సిసలు టెస్టు క్రికెట్ అంటే' అంటూ కామెంట్లు చేస్తున్నారు. మైదానంలో కోహ్లీ ఉంటే టెస్టులకు కూడా కళ వచ్చేస్తుందని అంటున్నారు.

Story first published: Friday, December 16, 2022, 7:05 [IST]
Other articles published on Dec 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+