Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కలిసి స్టెప్పేసిన కోహ్లీ, హార్దిక్ పాండ్యా..! నేడు ఆసీస్ వర్సెస్ ఇండియా టీ20 సిరీస్ ప్రారంభం

Virat Kohli and Hardik Pandya Danced Together During the Break in Practice Session

టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా ఆటలో ధాటిగా ఆడడమే కాకుండా చాలా సరదాగా కూడా ఉంటారనే సంగతి తెలిసిందే. ఇద్దరికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్. హార్దిక్ పాండ్యా తాను కెప్టెన్సీ వహించిన గుజరాత్ టైటాన్స్‌ను తొలి సీజన్లోనే విజేతగా నిలిపాడు. ప్రస్తుతం కెరీర్ పీక్ ఫామ్‌లో హార్దిక్ ఉన్నాడు. ఇకపోతే ఇటీవల ఒక నెల రోజులు గ్యాప్ తీసుకున్న తర్వాత కోహ్లీ మళ్లీ మునుపటి టచ్‌లోకి వచ్చారు.

ఆసియాకప్ టోర్నీలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఇకపోతే ఆసీస్‌తో నేటి నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల సిరీస్ కోసం వీరిద్దరు తెగ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక ప్రాక్టీస్ మధ్య వీరిద్దరు కలిసి ఓ పాటకు స్టెప్పులేశాడు. 'సే అకాబో' అనే రీమిక్స్ పాటకు ఓ డిఫెరెంట్ స్టెప్ ఇద్దరు అనుకరిస్తూ చేశారు. ఈ వీడియోను హార్దిక్ పాండ్యా తన సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేశాడు. టీమిండియా ప్లేయర్ల మధ్య ఇంత సాన్నిహిత్యం ఉండడం చాలా ఆనందంగా ఉంటుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

బౌన్సర్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు..

ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ చాలా ప్రాక్టీస్ చేశాడు. మొహాలీ వేదికగా మంగళవారం జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్లు మొహాలీలో ప్రాక్టీస్‌ సెషన్లలో నిమగ్నమయ్యాయి. కింగ్ కోహ్లీ ఈ సిరీస్ కోసం ముమ్మురంగా సాధన చేశాడు. ఆస్ట్రేలియా పేసర్లు సంధించే బౌన్సర్లను సమర్థంగా ఎదుర్కొవడమే లక్ష్యంగా పుల్ షాట్స్ ప్రాక్టీస్ చేశాడు. సోమవారం గంటల తరబడి నెట్స్‌లో భారత పేసర్ల బౌలింగ్‌లో పుల్ షాట్స్ కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ట్విట్టర్లో పోస్టు చేసింది.

ఆసియాకప్లో రెండు హాఫ్ సెంచరీలు, సెంచరీతో

ఆసియాకప్లో రెండు హాఫ్ సెంచరీలు, సెంచరీతో

ఇక గత కొన్నాళ్లుగా నిలకడలేమి ఫామ్‌తో ఇబ్బంది పడిన కోహ్లీ సతమతమవుతుండగా.. ఆసియాకప్ 2022టోర్నీలో తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో 35పరుగులు చేసి కాస్త క్లాస్ కనబరిచాడు. ఆ తర్వాత హాంగ్ కాంగ్‌పై హాఫ్ సెంచరీ బాదాడు. సూపర్ 4లో పాకిస్థాన్‌పై మరో హాఫ్ సెంచరీ బాదాడు. ఇక చివరగా ఆఫ్ఘన్‌పై సెంచరీ బాదడంతో మూడేళ్ల సెంచరీ కరవును తీర్చుకున్నాడు.

హర్షల్, బుమ్రాలపై స్పెషల్ ఫోకస్

హర్షల్, బుమ్రాలపై స్పెషల్ ఫోకస్

ఇకపోతే ఆసీస్ వర్సెస్ భారత్ మధ్య తొలి టీ20మ్యాచ్ మొహాలిలో జరగనుండగా.. రెండోది నాగ్‌పూర్ (శుక్రవారం), మూడోది హైదరాబాద్ (ఆదివారం) వేదికగా జరగనున్నాయి. టీ20 ప్రపంచకప్‌నకు ముందు బ్యాటింగ్, బౌలింగ్ సమతూకం చేసుకోవడానికి ఇది ఓ సన్నాహక టోర్నీగా ఉపయోగపడుతుంది. ఇకపోతే సీనియర్‌ పేసర్‌ జ‌స్‌ప్రీత్ బుమ్రా గాయం నుంచి కోలుకొని ఈ సిరీస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అలాగే యువ బౌలర్‌ హర్షల్‌ పటేల్ కూడా జట్టులోకి వచ్చాడు. వీరిద్దరూ టీ20 ప్రపంచకప్‌ జట్టుకు కూడా ఎంపికయ్యారు. చాలా రోజుల తర్వాత బుమ్రా, పటేల్ గ్రౌండ్లోకి దిగబోతుండడంతో వీళ్లపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఆస్ట్రేలియాతో సిరీస్లో బరిలోకి దిగే భారత జట్టు:

ఆస్ట్రేలియాతో సిరీస్లో బరిలోకి దిగే భారత జట్టు:

టాపార్డర్ : రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ,

మిడిలార్డర్ : సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్),

ఫినిషర్లు : దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా,

స్పిన్నర్లు : ఆర్.అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్,

పేసర్లు : భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా

Story first published: Tuesday, September 20, 2022, 8:14 [IST]
Other articles published on Sep 20, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+