Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ట్విట్టర్‌లో ఫోటోలు: మూడో వన్డేకి ముందు చిల్ మూడ్‌లో కోహ్లీ

 Virat Kohli and Co take much ‘needed’ day-off before Cuttack ODI

హైదరాబాద్: మూడు వన్డే కోసం టీమిండియా గురువారం కటక్‌కు చేరుకుంది. మూడో వన్డేకి ముందు కాస్త విరామం లభించడంతో టీమిండియా సరదాగా ఎంజాయ్ చేస్తోంది. శుక్రవారం ఇరు జట్లకు ప్రాక్టీస్‌ సెషన్‌ లేకపోవడంతో విరాట్ కోహ్లీ తన సహచరులతో కలిసి సరదాగా సందడి చేస్తున్నాడు.

ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్‍‌లో పోస్టు చేస్తూ "ఈ రోజు ప్రాక్టీస్‌ సెషన్‌ లేకపోవడంతో నా సహచరులకు ఒత్తిడి లేకుండా ఉండేందుకు అందరం కలిసి బయటికి వచ్చాం. సహచరులతో కలిసి ఆస్వాదిస్తున్నా" అంటూ కామెంట్ పెట్టాడు. కోహ్లీ పోస్టు చేసిన ఫోటోల్లో అతడితో పాటు కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌పంత్‌, రవీంద్ర జడేజా, కేదార్‌ జాదవ్‌, యజువేంద్ర చాహల్‌లు ఉన్నారు.

మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా ఆఖరి వన్డే ఆదివారం కటక్ వేదికగా జరగనుంది. ఇప్పటికే ముగిసిన రెండు వన్డేల్లో ఇరు జట్ల చెరో మ్యాచ్ నెగ్గడంలో సిరిస్ 1-1తో సమం అయింది. చెన్నైలో జరిగిన మొదటి వన్డేలో 8 వికెట్లతో విండీస్‌ చేతిలో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే.

విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌లు సెంచరీలతో చెలరేగడంతో టీమిండియా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్‌ సాధించాడు. మూడో వన్డేలో ఏ జట్టు అయితే గెలుస్తుందో ఆ జట్టు సిరిస్ విజేతగా నిలుస్తుంది.

Story first published: Friday, December 20, 2019, 18:52 [IST]
Other articles published on Dec 20, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+