న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండో టెస్టు గెలిస్తే.. టీమిండియా కొత్త రికార్డు!!

Virat Kohli and Co aim to breach Christchurch fortress after disastrous Wellington loss

హెగ్లే ఓవల్‌: సుదీర్ఘ న్యూజిలాండ్‌ పర్యటనలో టీమిండియా తేలిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 3-0తో వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత్.. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్టులోనూ కనీస పోటీ ఇవ్వకుండా కివీస్ ముందు తలొంచింది. ఇక ఫిబ్రవరి 29 నుంచి క్రైస్ట్‌చర్చి వేదికగా జరగనున్న రెండో టెస్టులో విజయం సాధించాలని టీమిండియా చూస్తోంది. మరోవైపు న్యూజిలాండ్‌ కూడా సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని పట్టుదలగా ఉంది. ఏ నేపథ్యంలో హెగ్లే ఓవల్‌ వేదికగా శనివారం నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టులో ఇరు జట్లూ హోరాహోరీగా తలపడనున్నాయి.

ఆసియా XI జట్టును ప్రకటించిన బంగ్లా బోర్డు.. ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు!!ఆసియా XI జట్టును ప్రకటించిన బంగ్లా బోర్డు.. ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు!!

అయితే రెండో టెస్టు జరగనున్న క్రైస్ట్‌చర్చి నగరంలో రెండు మైదానాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏఎంఐ స్టేడియం కాగా.. రెండోది హెగ్లే ఓవల్‌ స్టేడియం. భారత్ ఇప్పటివరకు ఏఎంఐ మైదానంలో నాలుగు టెస్టులు ఆడగా.. రెండు ఓటమిపాలై, మరో రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగించింది. ఇక ఇక 2014 నుంచి టెస్టు మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తున్న హెగ్లే ఓవల్ మైదానంలో ఇంతవరకు భారత్‌ ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు.

శనివారం ప్రారంభమయ్యే రెండో టెస్ట్ మ్యాచే భారత్‌కు హెగ్లే ఓవల్ మైదానంలో తొలి మ్యాచ్‌. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే క్రైస్ట్‌చర్చిలో తొలి విజయంతో పాటు టీమిండియా పేరిట కొత్త రికార్డు నమోదవుతుంది. మరోవైపు కివీస్‌ ఈ మైదానంలో ఆడిన ఆరు టెస్టుల్లో నాలుగు గెలిచి, ఒకటి ఓటమిపాలై, మరొక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. గతేడాది బంగ్లాదేశ్‌తో జరగాల్సిన ఒక టెస్టు ఉగ్రదాడుల కారణంగా రద్దయింది.

టెస్టు ఛాంపియన్‌షిప్‌లో తొలి ఓటమి రుచిచూసిన భారత్ రెండో మ్యాచ్‌లోనైనా గెలిచి సిరీస్‌ను డ్రాగా ముగించుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకి ఒక మార్పుతో బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో (16, 14)నూ ఫెయిలైన పృథ్వీ షాపై వేటుపడే అవకాశం ఉంది. షాకి బదులు శుభమన్‌ గిల్‌కి ఛాన్స్ ఇచ్చే సూచనలు ఉన్నాయి.

Story first published: Tuesday, February 25, 2020, 17:37 [IST]
Other articles published on Feb 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X