IND VS PAK: మనసు దోచుకున్న కోహ్లీ-బాబర్ - మ్యాచ్‌లో వీరిద్దరు కలిసి ఏం చేశారంటే?
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ - పాక్ మధ్య బిగ్ ఫైట్ హోరాహోరీగా సాగుతోంది. మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు దిగింది పాకిస్థాన్. అయితే ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ లో దాయాది జట్ల స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, బాబర్ ఆజామ్ కలిసి చేసిన ఓ చర్య క్రికెట్ అభిమానుల మనసును విపరీతంగా దోచుకుంటోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన సోషల్ మీడియాలోనూ తెగ చక్కర్లుకొడుతోంది. ఇంతకీ ఈ బడా స్టార్స్ కలిసి ఏం చేశారంటే?
India vs Pakistan Live స్కోరు కార్డు
మనసు దోచుకున్న అద్భుతమైన దృశ్యం..
సాధారణంగా ఏ రంగంలోనైనా ఇద్దరు బడా స్టార్లు ఉంటే.. వారి మధ్య స్నేహం బాగానే ఉన్నా... వారి అభిమానుల మధ్య మాత్రం ఎప్పుడు ఏదో ఒక వార్ కొనసాగుతూనే ఉంటుంది. 'మా వాడు గొప్ప అంటే.. లేదు మా వాడే గొప్ప' అంటూ వాగ్వివాదానికి దిగుతూనే ఉంటారు. కానీ సదరు స్టార్స్ మాత్రం 'మేం మేం బానే ఉంటాం.. అనవసరంగా మీరే...' అంటూ తమ మధ్య ఉన్న స్నేహబంధాన్ని చాటుతుంటారు. తాజాగా విరాట్ కోహ్లీ - బాబర్ ఆజామ్ కూడా అదే చేశారు. ఈ అద్భుతమైన దృశ్యం తాజాగా జరుగుతోన్న భారత్ - పాక్ మ్యాచ్ లో చోటు చేసుకుంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ లో ఓపెనర్ గా వచ్చిన బాబర్ ఆజామ్ తో సరదాగా ముచ్చటించాడు విరాట్ కోహ్లీ. అతడి వీపుపై తడుతూ నవ్వుతూ అభినందించాడు. దానికి బాబర్ కూడా నవ్వుతూ సమాధానమిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోనే ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతూ క్రికెట్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. మీరూ క్రికెట్ అభిమాని అయితే ఎంచక్కా ఈ వీడియోను సరదాగా ఓ లుక్కేసేయండి..
Babar X Kohli 🫶❤️🩹#PAKvsIND #INDvsPAK #PAKvIND #iccchampionstrophy2025 #ChampionsTrophy pic.twitter.com/Lv9MMVZWKB
— Furqan👑🖤 (@furqan_ashfaq77) February 23, 2025
Virat Kohli gave Babar Azam an encouraging pat on the back as he stepped up to bat. #PAKvIND #CT25 pic.twitter.com/eTgKWlBXa9
— Imran Riaz Khan فین (@exsend99) February 23, 2025
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications