Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli మళ్లీ గుడ్ న్యూస్ చెప్పనున్న కోహ్లీ, అనుష్క దంపతులు..? వెకేషన్ వెళ్లొచ్చాక చెకప్ కోసం హాస్పిటల్‌కు

 Virat Kohli And Anuskha Sharma Spotted At Hospital: Did Anushka Sharma Got Pregnant Again?

అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ దంపతులు వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లిన సంగతి తెలిసిందే. తమ వెకేషన్ నుంచి వారు సోమవారం తిరిగి వచ్చారు. ముంబైలోని విమానాశ్రయంలో సోమవారం మధ్యాహ్నం వీరిద్దరూ కనిపించారు. ఇక అనుష్క బ్లాక్ కలర్ దుస్తులలో ఆకట్టుకునేలా కన్పించగా.. విరాట్ ఆల్ వైట్ అండ్ వైట్‌తో స్టైలీష్‌గా కన్పించాడు. తమ కూతురు వామికాతో పాటు వీరిద్దరు కొన్ని రోజులు విరామం కోసం మాల్దీవులకు వెళ్లారు. ఇక వీరిద్దరు విమానాశ్రయం నుంచి బయటికి వచ్చాక మీడియా కెమెరామ్యాన్లకు పోజులిస్తూ కన్పించారు. ఇక తాము ఏ వెకేషన్ కు వెళ్తున్నమనేది ఈ జంట వెల్లడించకపోయినా.. బీచ్‌, వాళ్లు దిగిన ఫోటోలు బట్టి ఎక్కువ మంది సెలబ్రెటీలు వెళ్లే మాల్దీవులకు వీళ్లు కూడా వెళ్లినట్లు స్పష్టమైంది. ఇక అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో తమ వెకేషన్ ఫోటోలను ఇటీవల పంచుకుంది. టైమర్ మోడ్‌లో ఆమె తనకు తానుగా ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ముంబైలో వీరు సాయంత్రం కోకిలా బెన్ అంబానీ హాస్పిటల్ వద్ద కన్పించారు. వీరు కార్లో హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఓ ఫోటోగ్రాఫర్ వీరి వీడియో తీశాడు. ఇక వెకేషన్ తర్వాత వెంటనే వీరిద్దరు హాస్పిటల్‌కు వెళ్లడం చర్చనీయాంశమైంది.
ఇక అనుష్క మళ్లీ ప్రెగ్నెంట్ అయిందేమో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ దంపతులు తాము హాస్పిటల్‌కు వెళ్లిన రీజన్ గురించి మాత్రం వెల్లడించలేదు.

ఇక విరాట్ కోహ్లీకి దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు బీసీసీఐ విశ్రాంతి‌నివ్వడంతో అతను ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాడు. చాలా కాలంగా ఐపీఎల్, ఇతర మ్యాచ్‌లు ఆడుతుండడంతో అతను అలసిపోయి ఉంటాడని, అతనికి సరైన విరామం కావాలని గత కొన్ని రోజులుగా క్రికెట్ ప్రముఖులు అతనికి సూచనలిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్ 2022లో కోహ్లీ పేలవ ఫామ్ కనబర్చి విమర్శలపాలయ్యాడు. ఇక ఇంగ్లాండ్‌తో టెస్ట్ కోసం అతను సిద్ధం కాబోతున్నాడు.

Story first published: Tuesday, June 14, 2022, 10:46 [IST]
Other articles published on Jun 14, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+