Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ-అనుష్క కలిసి డిన్నర్, 'అలా నొప్పి పోయింది..'

బెంగళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ మరోసారి ఒకచోట కనిపించారు. కోహ్లీ, అనష్కలు డేటింగ్ చేశారు. ఆ తర్వాత దూరం జరిగారు. మళ్లీ ఇటీవలే ఒక్కటవుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి వారిద్దరు కలిసి కనిపించారు.

సమాచారం మేరకు అనుష్క, కోహ్లీలు ఓ రెస్టారెండులో కనిపించారు. బెంగళూరులోని ప్రముఖ జపనీస్ రెస్టారెంటులో వీరిద్దరు కలిసి డిన్నర్‌కు వచ్చారు. మే 14వ తేదీన గుజరాత్ లయన్స్ పైన గెలిచిన అనంతరం వీరిద్దరు డిన్నర్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారని తెలుస్తోంది.

Virat Kohli and Anushka Sharma spotted on another dinner date

నొప్పి అలా మాయమైంది: కోహ్లీ

పంజాబ్‌తో మ్యాచ్‌లో అక్షర పటేల్‌ క్యాచ్‌ను పట్టుకొన్న కోహ్లీ.. వెంటనే బాధతో విలవిల్లాడిపోయాడు. అందుకు కారణం.. అంతకుముందు ఎనిమిది కుట్లు పడ్డ ఎడమ చేతికి బంతి తగలడమే. అంతగా విలవిలలాడిన కోహ్లీ.. అంతకుముందు పంజాబ్‌ బౌలింగ్‌ను చితక్కొట్టాడు.

దీనిపై విరాట్ మాట్లాడుతూ... తొలుత జాగ్రత్తగానే ఆడానని, తర్వాత ఒకొక్క షాట్‌ బౌండరీకి వెళుతుంటే నొప్పి దానంతట అదే మాయమైందని చెప్పాడు. గాయపడ్డాను కాబట్టి భారీ షాట్లు ఆడొద్దనే అనుకున్నానని, కొద్దిగా కుదురుకున్నాక నేనిక ఆ కుట్ల గురించి ఆలోచించకూడదన్నానని చెప్పాడు.

బ్యాటింగ్‌లో ఊపు అందుకున్నాక నొప్పి కూడా మాయమైపోయిందన్నాడు. షాట్లు కూడా ఆడానని, ట్వంటీ 20 మ్యాచ్‌ అంటే కేవలం మూడు గంటలేనని, మిగతా 21 గంటలు నేను విశ్రాంతి తీసుకోవచ్చునని ఆలోచించాని చెప్పాడు. గేల్ బాగా ఆడాడని, ఇప్పుడు మా జట్టు జోరు మీద ఉందన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+