Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భుటాన్‌ ట్రిప్.. లేగ దూడలు, కుక్కపిల్లతో 'విరుష్క' ఆటలు!!

Virat Kohli and Anushka Sharma play with street dog in Bhutan trip


హైదరాబాద్: తీరికలేని క్రికెట్ ఆడుతున్న భారత కెప్టెన్‌ విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్‌ టీ20 సిరీస్ నుండి విరామం తీసుకున్న విషయం తెలిసిందే. కోహ్లీ తన 31వ బర్త్ డే సందర్భంగా బాలీవుడ్‌ హీరోయిన్, తన భార్య అనుష్క శర్మతో కలిసి భుటాన్‌కు వెళ్ళాడు. దాదాపు వారం రోజులుగా విరుష్క జోడి భుటాన్‌లోని అందమైన ప్రదేశాల్లో చక్కర్లు కొడుతున్నారు.
భుటాన్‌లో విహారం:

భుటాన్‌లో విహారం:

ఇటీవల విరాట్ కోహ్లీ తన జన్మదిన వేడుకలను అనుష్కతో కలిసి భుటాన్‌లో ఎలాంటి హంగూఆర్భాటాలు లేకుండా జరుపుకొన్నాడు. దీనికి సంబంధించిన పోటోలను అనుష్క సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అవికాస్తా వైరల్ అయ్యాయి. విరుష్క జోడి ప్రస్తుతం అక్కడే ఉంది. భుటాన్‌లో సుందరమైన సౌందర్యాన్ని ఆస్వాదించడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఈ భుటాన్‌ పర్యటనకు సంబందించిన మరికొన్ని ఫొటోలను ఆదివారం అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

కుక్క పిల్లతో విరుష్క ఆటలు:

కుక్క పిల్లతో విరుష్క ఆటలు:

ఫోటోలలో కోహ్లీ, అనుష్క ఇద్దరూ వీధి కుక్క పిల్లతో సరదాగా గడుపుతున్నారు. అంతేకాదు లేగ దూడలతో కోహ్లీ ఆడుకుంటుంటే.. అనుష్క అలా చూస్తూ ఎంజాయ్ చేసింది. ఈ ఫోటోలను పోస్ట్ చేసిన కొద్దిక్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

నవంబర్‌ 14 నుంచి టెస్ట్ సిరీస్:

నవంబర్‌ 14 నుంచి టెస్ట్ సిరీస్:

భుటాన్‌ ట్రిప్ అనంతరం నవంబర్‌ 14 నుంచి ఆరంభమయ్యే బంగ్లా టెస్టు సిరీస్‌కు విరాట్ కోహ్లీ తిరిగి అందుబాటులో ఉంటాడు. కోహ్లీ బంగ్లా టీ20 సిరీస్ నుండి విరామం తీసుకోవడంతో రోహిత్ శర్మ జట్టు బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇండోర్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. అనంతరం కలకత్తా వేదికగా 22 నుండి డే-నైట్ టెస్ట్ ప్రారంభం కానుంది. మరోవైపు ట్రిప్ నుండి వచ్చాక అనుష్క తన తర్వాతి ప్రాజెక్ట్‌ను ప్రకటించే అవకాశం ఉంది.

కోహ్లీ దుస్తులు వేసుకోవడమంటే ఇష్టం:

కోహ్లీ దుస్తులు వేసుకోవడమంటే ఇష్టం:

భుటాన్‌ పర్యటనకు ముందు వోగ్ మ్యాగజైన్‌కు అనుష్క శర్మ ఫొటో షూట్ ఇచ్చారు. షూట్ అనంతరం నిర్వహించిన ఇంటర్వ్యూలో అనుష్క మీడియాతో మాట్లాడారు. 'విరాట్ వార్డ్ రోబ్‌లో చాలా దుస్తులు ఉంటాయి. నాకు నచ్చిన వాటిని వేసుకుంటా. ఎక్కువగా టీషర్ట్స్ వేసుకోవడానికి ఇష్టపడతా. కొన్నిసార్లు కోహ్లీ జాకెట్స్ కూడా వేసుకుంటా. నేను కోహ్లీ దుస్తులు వేసుకుంటే అతను చాలా సంతోషిస్తాడు. నాక్కూడా ఇష్టమే' అని తెలిపింది.

 ఫ్యాషన్ ట్రెండ్స్‌ని ఫాలో కాను:

ఫ్యాషన్ ట్రెండ్స్‌ని ఫాలో కాను:

'నేను ఫ్యాషన్ ట్రెండ్స్‌ని ఫాలో కాను. అందుకే అందరు అమ్మాయిలు ఎంచుకునే పింక్ కలర్‌నే నా పెళ్లి రోజున ఎంచుకున్నా. పెళ్లి దుస్తులు కావాలని ఎంపిక చేసినవి కావు' అని అనుష్క తెలిపారు. రెండేళ్ల క్రితం ఇటలీలోని టస్కనీలో కోహ్లీ, అనుష్కలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొద్ది మంది సమక్షంలో పెళ్లి చేసుకున్నా.. భారత్ వచ్చాక పెద్ద రిసెప్షన్ ఇచ్చారు.

Story first published: Monday, November 11, 2019, 16:41 [IST]
Other articles published on Nov 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+