ఆర్సీబీ విక్టరీ.. అనుష్కతో కలిసి కోహ్లీ ఏం చేశాడో చూడండి! (వీడియో)
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ వరుసగా రెండో ఏడాది కూడా విశ్వవిజేతగా నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుపై ఆర్సీబీ ఘనవిజయం సాధించిన తర్వాత స్టేడియంలోనూ, బయటా సంబరాలు అంబరాన్నంటాయి. ఈ క్రమంలోనే టీమిండియా రన్ మెషీన్, ఆర్సీబీ లెజెండ్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి చేసిన ఓ క్యూట్ డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ స్టార్ కపుల్ ఆర్సీబీ టైటిల్ గెలిచిన ఆనందంలో చిందులు వేస్తూ కనిపించిన దృశ్యాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
వరుసగా రెండోసారి విజేతగా ఆర్సీబీ
రజత్ పాటిదార్ కెప్టెన్సీలోని ఆర్సీబీ జట్టు నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ తుది పోరులో గుజరాత్ టైటాన్స్ జట్టుపై 5 వికెట్లతో ఘన విజయం సాధించింది. గుజరాత్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 18 ఓవర్లలోనే ఛేదించి వరుసగా రెండో ఏడాది ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శిస్తూ.. 75 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు ఒంటరి చేత్తో విజయాన్ని అందించాడు. మ్యాచ్ గెలిచిన అనంతరం ఆర్సీబీ యాజమాన్యం షేర్ చేసిన వీడియోలో కోహ్లీ తన భార్య అనుష్క, ఆర్సీబీ మెంటార్ దినేష్ కార్తీక్‌లతో కలిసి డాన్స్ చేస్తూ ఫుల్ జోష్‌లో కనిపించాడు.

కుర్రాళ్ల పోటీ వల్లే నా ఆట శైలి మారింది: విరాట్ కోహ్లీ
పోస్ట్-మ్యాచ్ ప్రెజెంటేషన్ వేడుకలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. తన ఆనందాన్ని పంచుకున్నాడు. "ఇది నేను ఎప్పుడో కన్న కల.. విన్నింగ్ రన్ కొట్టి జట్టును గెలిపించాలని చాలాసార్లు అనుకున్నాను, అది ఈరోజు నిజమైంది" అని విరాట్ కోహ్లీ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ.. 37 ఏళ్ల వయసులోనూ తన మైండ్‌సెట్‌ను మార్చుకోవడానికి ఐపీఎల్‌లోకి వస్తున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ వంటి నవతరం కుర్రాళ్లే కారణమని సరదాగా కామెంట్ చేశాడు. నేటి తరం యువ ఆటగాళ్లు ఇస్తున్న పోటీ వల్లే తాను గేమ్‌ను మరింత వేగంగా ఆడాల్సి వస్తోందని, అందుకు తగ్గట్టుగా తన దూకుడును పెంచానని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
ఒంటిచేతిపై ఆధారపడకుండా సమిష్టిగా రాణించిన జట్టు
గత సీజన్లతో పోలిస్తే ఈ ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీకి లభించిన అతిపెద్ద సానుకూలత జట్టు సమిష్టి విజయం. దీనిపై విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. తాము ఈ రోజు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశామని ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సీజన్ మొదటి 10 మ్యాచ్‌ల్లో8 మంది విభిన్న ఆటగాళ్లు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులు గెలుచుకున్నారని.. జట్టు కేవలం తన ఒక్కడిపైనే ఆధారపడకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని ఆడటం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని కోహ్లీ స్పష్టం చేశాడు. ఇలాంటి పటిష్టమైన ప్లేయర్లతో కలిసి ఆడటం ఎంతో గర్వంగా ఉందంటూ కోహ్లీ తన ఐపీఎల్ ప్రయాణాన్ని కొనియాడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications