
గోవాలో కోహ్లీ-అనుష్క
శనివారం విశాఖలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన ఐదో వన్డే ముగియగానే కోహ్లీ గోవాకు పయనమయ్యాడు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో భాగంగా ఎఫ్‌సీ గోవా, ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌ను స్టేడియంలో వీరిద్దరూ కలిసి వీక్షిస్తూ ఇద్దరూ ఉత్సాహంగా గడిపారు.

గోవా జట్టుకు కోహ్లీ సహ యజమాని
గోవా జట్టుకు సహ యజమానిగా ఉన్న విరాట్ కోహ్లీ ఈ సీజన్‌లో ఓ పుట్ బాల్ మ్యాచ్ కి హాజరవడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ కోసం కోహ్లీ గోవా జట్టు జెర్సీని ధరించాడు. మరోవైపు ప్రేయసి అనుష్క శర్మ మాత్రం తెలుపు రంగు సల్వార్ సూట్‌లో సింపుల్ గా ఉంది. వీరిద్దరి ప్రేమ గురించి 2014లో అందరికీ తెలిసింది.

విడిపోయినట్లు ప్రచారం
అయితే ఇటీవల కాలంలో ఈ జంట విడిపోయినట్లు ప్రచారం జరిగింది. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ చాలా కాలం తర్వాత కోహ్లీ-అనుష్క జంటగా కనిపించడంతో వీరిని చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపించారు. ఐఎస్ఎల్ మ్యాచ్ సందర్భంగా వీరితో కలిసి ఫొటోలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు.

'లక్కీ ఫ్యాన్' అంటూ ట్వీట్‌లో ఫోటో
కోహ్లీ-అనుష్కతో ఓ ఫ్యాన్ చిరునవ్వు చిందిస్తూ ఫోజోలకు ఫోజులిచ్చాడు. ఈ ఫోటోని కోహ్లీ తన ట్విట్టర్‌లో 'లక్కీ ఫ్యాన్' అంటూ ట్వీట్ చేశాడు. కాగా న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను టీమిండియా 3-2తో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ వన్డే సిరిస్ అనంతరం టీమిండియా ఇంగ్లాండ్‌తో టెస్టు సిరిస్‌తో పాటు వన్డేలు, టీ20 సిరిస్ ఆడనుంది. ఇదిలా ఉంటే న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్ ముగియడంతో ప్రస్తుతం విరాట్ కోహ్లి విశ్రాంతి తీసుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications











