Virat Kohli-Anushka Sharma: భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి భవిష్యత్తులో కేవలం వన్డే మ్యాచ్‌లలో మాత్రమే ఆడతానని వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన క్రికెట్ మైదానంలో కాకుండా వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్ షిప్‌కు హాజరై సందడి చేశాడు. తన భార్య అనుష్కశర్మతో కలిసి దిగ్గజ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ ఆడిన మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ సూట్-బూట్‌లో కనిపించి తన స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కోహ్లీ ఫోటోలలో ఆయన తన భార్య అనుష్కతో కలిసి మ్యాచ్‌ను ఆస్వాదిస్తూ కనిపించారు.
నొవాక్ జకోవిచ్‌కు అద్భుత విజయం
నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్ డి మినార్‌తో తలపడ్డాడు. జకోవిచ్ ఆరంభం అంత గొప్పగా లేదు. మొదటి రౌండ్ లో 1-6తో వెనుకబడ్డాడు. అయితే ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని నాలుగు రౌండ్ల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో విజయం సాధించాడు. ఈ విజయంతో జకోవిచ్ వింబుల్డన్ 2025 క్వార్టర్ ఫైనల్స్‌లో తన స్థానాన్ని ఖరారు చేసుకున్నాడు.

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల పదేళ్ల నాటి ఫోటో వైరల్
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వింబుల్డన్ చూడటానికి రావడం ఇదే మొదటిసారి కాదు. పదేళ్ల క్రితం 2015లో కూడా ఈ జంట ఈ గొప్ప టెన్నిస్ టోర్నమెంట్‌ను చూసేందుకు హాజరయ్యారు. కొందరు అభిమానులు సోషల్ మీడియాలో వారి 2015, 2025 నాటి ఫోటోలను పక్కపక్కన పెట్టి పోల్చారు. ఈ రెండు ఫోటోలలో విరాట్ లుక్ పూర్తిగా భిన్నంగా కనిపించింది.
నోవాక్ జొకోవిచ్ విజయంపై విరాట్ కోహ్లీ స్పందన
విరాట్ కోహ్లీ వింబుల్డన్‌లో నోవాక్ జొకోవిచ్ సాధించిన విజయంపై స్పందించాడు. ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో జకోవిచ్‌ను ప్రశంసిస్తూ, "ఎంత అద్భుతమైన మ్యాచ్. గ్లాడియేటర్‌కు ఎప్పటిలాగే ఇది సులభమైన పని" అని రాసుకొచ్చాడు. విరాట్ కోహ్లీ మద్దతుకు నొవాక్ జకోవిచ్ కూడా ధన్యవాదాలు తెలిపాడు.