For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గొప్ప క్రికెట్ కావాలని ఆశపడుతున్నాడు: కోహ్లీపై ఆర్‌సీబీ కోచ్

By Nageshwara Rao
Virat Kohli always had the hunger to be great: Gary Kirsten

హైదరాబాద్: ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగుల దాహం‌తో ఉన్నాడని ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ గ్యారీ కిరిస్టన్ అభిప్రాయపడ్డాడు. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన గ్యారీ ఆ తర్వాత టీమిండియా ప్రధాన కోచ్‌గా పనిచేశారు.

2007 నుంచి 2011 వరకు భారత జట్టుకు కోచ్‌గా పనిచేసిన గ్యారీ కిరిస్టన్ పర్యవేక్షణలోనే టీమిండియా టెస్టు క్రికెట్‌లో ఎన్నో మెరుగైన విజయాలను సాధించడంతో పాటు, ధోని నాయకత్వంలోని టీమిండియా 2011 వరల్డ్ కప్‌ను కూడా సొంతం చేసుకుంది.

అప్పుడే అండర్-19 వరల్డ్ కప్ గెలిచి టీమిండియాలో చోటు దక్కించుకున్న విరాట్ కోహ్లీ ఆటను చూసిన గ్యారీ కిరిస్టన్ భవిష్యత్తులో అతడు గొప్ప క్రికెటర్ అవుతాడని తాను ముందే ఊహించినట్లు చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 11వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహారిస్తున్నారు.

Virat Kohli always had the hunger to be great: Gary Kirsten

కోహ్లీ గురించి మాట్లాడుతూ 'విరాట్ కోహ్లీతో కలిసి మళ్లీ పనిచేస్తుండటం ఆనందంగా ఉంది. నేను కోచ్‌గా ఉన్నప్పుడే అతను కెరీర్ ప్రారంభించాడు. అప్పట్లో మా మధ్య కెరీర్ ఎదుగుదల, ఆట మెరుగుకి సంబంధించి సుదీర్ఘ చర్చలు నడిచేవి. కోహ్లీ గొప్ప క్రికెటర్ అవుతాడని నేను ఊహించా' అని కిరిస్టన్ అన్నాడు.

'అప్పట్లో కోహ్లీకి బ్యాటింగ్‌లో మెరుగులు దిద్దుకోవాలని సూచించా. ఇది చాలా ఫన్నీగా అనిపిస్తోంది. ఇప్పుడు మళ్లీ ఐపీఎల్ కోసం అతడితో కలిసి పనిచేస్తుంటే చాలా సరదాగా ఉంది. కోహ్లీ ప్రస్తుతం పరుగుల దాహంతో ఉన్నాడు. గొప్ప క్రికెటర్‌ కావాలని అతను ఆశపడుతున్నాడు' అని చెప్పాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో చేరడంపై 'ఐపీఎల్‌లో ప్రతి ప్రాంఛైజీ కూడా టైటిల్ గెలవాలని శక్తిమేరకు పనిచేస్తున్నాయి. టీ20 క్రికెట్ అదే విధంగా ముందుకు సాగుతుంది. ఆటగాళ్ల విలువ తెలుసుకునేందుకు చాలా ఆసక్తి ఉండాలి. గత ఐదేళ్లుగా టీ20 క్రికెట్‌పై ఎక్కువ దృష్టి పెట్టా. ఆటగాళ్ల ఎంపికే ఇక్కడ ముఖ్యం' అని గ్యారీ కిరిస్టన్ వెల్లడించాడు.

Story first published: Thursday, April 19, 2018, 18:10 [IST]
Other articles published on Apr 19, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+