For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండో టీ20: అడుగుదూరంలో అరుదైన రికార్డుకి చేరువగా కోహ్లీ

Virat Kohli aims to end New Zealand monopoly

హైదరాబాద్: టెస్టుల్లో, వన్డేల్లో చివరికి పొట్టి క్రికెట్ టీ20ల్లోనూ విరాట్ కోహ్లీ రికార్డులకు కొదవలేదు. ప్రతి మ్యాచ్‌లో కనీసంగా రెండు రికార్డులపైనే గెలుచుకున్నాడు కోహీ. టీ20 ఫార్మాట్‌లో అరుదైన రికార్డ్‌కి భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అడుగు దూరంలో ఉన్నాడు.

అతని కెరీర్‌లో ఇప్పటి వరకు 56 టీ20 మ్యాచ్‌లాడి 1,982 పరుగులు చేశాడు. దీంతో అతను మరో 18 పరుగులు చేస్తే పొట్టి క్రికెట్‌లో 2,000 పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కనున్నాడు. ఈ 2వేల పరుగుల క్లబ్‌లో ఇప్పటికే న్యూజిలాండ్ హిట్టర్ మార్టిన్ గప్తిల్ 2,250 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రెండో స్థానంలో కూడా ఆ దేశానికే చెందిన మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కలమ్ ఉన్నాడు.'

ఇంకా, ఈ 2వేల పరుగులు మైలురాయిని ఇప్పటికే అందుకున్న గప్తిల్, మెక్‌కలమ్ టీ20ల్లో రెండు శతకాలు నమోదు చేశారు. కోహ్లికీ మాత్రం ఈ ఫార్మాట్‌లో మూడంకెల స్కోరును ఇప్పటివరకు అందుకోలేదు. అయితే.. ఐపీఎల్‌ 2016 సీజన్‌లో మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున విరాట్ కోహ్లి నాలుగు శతకాలు చేశాడు.

దక్షిణాఫ్రికాతో బుధవారం రాత్రి 9.30 నుంచి రెండో టీ20 మ్యాచ్ జరగనుండగా.. ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో మూడు శతకాలు బాది ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లికి 18 పరుగులు సాధించడం చెప్పుకోదగ్గ విషయం కాకపోవచ్చచ్చు.

Story first published: Wednesday, February 21, 2018, 13:14 [IST]
Other articles published on Feb 21, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+