‘అదే గొప్ప గౌరవం’: కోహ్లీ ఖాతాలో మరో అరుదైన మైలురాయి
పల్లెకెలె: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో మైలురాయిని అందుకున్నాడు.
ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న భారత్.. ఆతిథ్య జట్టుతో వన్డే సిరీస్‌లో తలపడుతోంది. తాజాగా గురువారం పల్లెకెలె వేదికగా జరిగిన రెండో వన్డే విరాట్ కోహ్లి కెరీర్‌లో 300వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం.
ఈ సందర్భంగా కోహ్లీ స్పందిస్తూ.. 'నేను అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసి 9ఏళ్లు అవుతోంది. ఇన్నేళ్లుగా భారత్ క్యాపు ధరించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. మైదానంలో అడుగుపెట్టినప్పుడల్లా నా అత్యుత్తమ ఆటను ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తా. ఎల్లప్పుడూ అలా చేయడానికే ఇష్టపడతాను' తెలిపాడు.

కాగా, అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఫిట్‌నెస్, అద్భుత ఫామ్‌తో రాణిస్తూ ఈ మైలురాయిని చేరుకున్నాడు కోహ్లీ. ఇప్పటి వరకు 191 వన్డేలు.. 60 టెస్టులు.. 49 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు.
2008లో శ్రీలంకతో దంబుల్లా వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన విరాట్ ఈ సుధీర్ఘ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను అందుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications