Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కుంబ్లేని తిట్టిన కోహ్లీ: ఫైనల్‌కు రెండు రోజుల ముందు ఏం జరిగింది?

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కోచ్ అనిల్ కుంబ్లేల మధ్య విభేదాల గురించి కొత్త కొత్త విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. బుధవారం బయటికొచ్చిన ఓ విషయం పెను సంచలనం సృష్టిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు రెండు రోజుల ముందు జట్టు సమావేశంలో కుంబ్లేపై కోహ్లీ నోరుపారేసుకున్నాడంట.

దీంతో మనస్తాపానికి గురైన కుంబ్లే ఇంత సడెన్‌గా కోచ్ పదవికి రాజీనామా నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. నిజానికి కొత్త కోచ్‌ పదవి ఎంపికపై బోర్డు ఇంకా ఏం తేల్చుకోని నేపథ్యంలో ఛాంపియన్స్‌ ట్రోఫీ అనంతరం ఇంకో రెండు వారాల పాటు పదవిలో కొనసాగాలని, వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లాలని బోర్డు కుంబ్లేను కోరింది.

దీనికి కుంబ్లే సానుకూలంగానే స్పందించినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. అయితే ఉన్నట్టుండి హఠాత్తుగా కుంబ్లే మంగళవారం బోర్డుకి తన రాజీనామా లేఖను పంపించి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం వెనుక అసలు కారణం ఇదీ అని జట్టులోని వర్గాలు వెల్లడించాయి.

Virat Kohli abused Anil Kumble in team meeting two days ahead of ICC Champions Trophy final: Sources

ఫైన‌ల్‌కు ముందు ఎప్ప‌టిలాగే జట్టు మీటింగ్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కుంబ్లేతో విరాట్ కోహ్లీ వాగ్వాదానికి దిగడ‌ంతో పాటు అతడిని తిట్టిన‌ట్లు స‌మాచారం. కుంబ్లే పట్ల కోహ్లీ ఒకింత ఆగ్రహావేశాన్ని కూడా ప్రదర్శించాడంట. దీంతో పాటు జట్టులో ఎవ‌రూ నువ్వు కోచ్‌గా కొన‌సాగాల‌ని అనుకోవ‌డం లేద‌ని కోహ్లీ అన్న‌ట్లు తెలిసింది.

అయితే కుంబ్లే మాత్రం జ‌రిగిందేదో జ‌రిగింది అని గొడ‌వ‌ను ఆపే ప్ర‌య‌త్నం చేశాడు. అయినా కోహ్లీ విన‌క‌పోవ‌డంతో కుంబ్లే మ‌న‌స్తాపానికి గుర‌య్యాడు. దీంతో కోచ్ ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవ‌డ‌మే మంచిద‌ని భావించి.. విండీస్ పర్యటనకు వ‌ర‌కు కొన‌సాగాల‌ని క్రికెట్ సలహా కమిటీ కోరినప్పటికీ రాజీనామా చేశాడు.

కోచ్‌గా తన పద్ధతులపై కెప్టెన్‌కు అభ్యంతరాలున్నట్లుగా బోర్డు తనకు తెలిపిన నేపథ్యంలో తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కుంబ్లే స్పష్టం చేశాడు. 'సోమవారం నేను బీసీసీఐ నుంచి ఓ సమాచారం అందుకున్నాను. ప్రధాన కోచ్‌గా కొనసాగాలంటే కెప్టెన్ విరాట్ కోహ్లీ సూచించిన విధంగా జట్టు శిక్షణలో కొన్ని మినహాయింపులు పాటించాలని కోరింది. జట్టు కెప్టెన్‌తో గౌరవంగా మెలుగడంలో కోచ్‌గా నా పరిధి మేరకు ప్రవర్తించడం తెలుసు. అందుకే బీసీసీఐ నుంచి వచ్చిన సూచన నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. కెప్టెన్‌కు నాకు మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు బీసీసీఐ పూర్తిస్థాయిలో ప్రయత్నించినా మా ఇద్దరి భాగస్వామ్యం అసంపూర్ణంగా ముగిసింది. దీంతో తప్పుకోవడమే మేలనిపించి ఈ నిర్ణయం తీసుకున్నాను' అని రాజీనామా లేఖలో కుంబ్లే పేర్కొన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+