Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అదే జరిగితే... పాక్‌నే కాదు.. ఏ జట్టునైనా ఓడిస్తాం.. కెప్టెన్ కొహ్లీ షాకింగ్ కామెంట్స్

Kohli

హైదరాబాద్: క్రికెట్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు భారత జట్టు ఉరకలేస్తున్నది. ప్రపంచ క్రికెట్ కప్‌లో పాక్‌పై ఎదురులేని విజయాలు సాధించిన రికార్డు సొంత చేసుకొన్న భారత్ మరో చారిత్రాత్మక విజయంపై కన్నేసింది. ఆదివారం ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో పాకిస్థాన్‌తో భారత జట్టు తలపడుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచకప్‌లో కీలక మ్యాచ్‌కు ముందు భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ.. జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ప్రయత్నం చేశాడు. జట్టు విజయంపై కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొహ్లీ మాట్లాడుతూ...

 పాకిస్థాన్‌ జట్టును తక్కువ అంచనా

పాకిస్థాన్‌ జట్టును తక్కువ అంచనా

పాక్ జట్టును తక్కువగా అంచనా వేయడం లేదు. ఆ జట్టులో మంచి టాలెంట్ ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. అలాగే భారత జట్టులో యువ టాలెంట్ ఉరకలేస్తున్నది. గత రెండు మ్యాచ్‌లో మా జట్టు సభ్యుల ప్రతిభ ఎలాంటిందో రుచి చూపించాం. జట్టుగా కలిసి ఆడేందుకు మానసికంగా సిద్ధమైనాం. ప్రత్యర్థి జట్టు బలబలాలను పట్టించుకోవడం లేదు. కేవలం మా శక్తి యుక్తులపైనే దృష్టి సారించాం అని కొహ్లీ అన్నారు.

అదే ఊపును కొనసాగిస్తాం

జట్టుగా సమిష్టి కృషి చేస్తే ప్రపంచంలోనే ఏ జట్టునైనా ఓడిస్తాం. గత రెండు మ్యాచ్‌లలో అదే విషయాన్ని మా సభ్యులు రుజువు చేశారు. అదే ఊపును కొనసాగించాలని మా ఆటగాళ్లు ఉత్సాహంతో ఉన్నారు. ఏ జట్టు అయినా అద్భుతమైన ఆటను ప్రదర్శించేందుకు ఆటగాళ్లు రెడీగా ఉన్నారు. జట్టు కూర్పును ఆదివారమే చేస్తాం. బలం, బలహీనతలను కచ్చితంగా అంచనా వేస్తున్నాం అని కొహ్లీ తెలిపారు.

 మహ్మాద్ అమీర్ గురించి పట్టించుకోవడం లేదు

మహ్మాద్ అమీర్ గురించి పట్టించుకోవడం లేదు

2017‌లో జరిగిన చాంఫియన్ ట్రోఫి ఫైనల్లో భారత్ జట్టు నడ్డి విరిచిన మహ్మద్ అమీర్ మరోసారి భారత్‌కు ముప్పుగా మారుతాడా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. టీఆర్పీ రేటింగ్, సంచలన వార్తల కోసం నేను మాట్లాడను. ప్రతిభావంతుడైన ఏ బౌలర్ నైనా గౌరవించాల్సిందే. పాకిస్థానా? మరో జట్టా అనే విషయాన్ని పక్కన పెట్టి ప్రతీ ఒక్కరి వ్యక్తిగత నైపుణ్యాలను మెచ్చుకోవాల్సిందే. అమీర్ టాలెంట్ గానీ, లేదా దక్షిణాఫ్రికాకు చెందిన కగిసో రబడా ప్రతిభను గానీ తక్కువ అంచనా వేయడం సరికాదు అని కొహ్లీ అన్నారు.

నా మైండ్‌లో అలాంటిది లేదని

అమీర్ వికెట్లు పడగొట్టడం, మరొకరు పరుగులు సాధించడం మ్యాచ్‌పై కొంత ప్రభావం చూపిస్తుంది. కానీ జట్టులో మరో పది మంది ఉంటారనే విషయాన్ని మరువొద్దు. క్రికెట్‌లో జట్టుగా ఆడితేనే తప్ప.. వ్యక్తిగత రికార్డులు, ప్రతిభకు అంత ప్రధాన్యం ఉండదు. నేను ఎవరికీ పోటీ కాదు. ఎవరైనా అలా భావిస్తే అది వారి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. నా మైండ్‌లో మరొకరితో పోటీ పడాలనే ఆలోచన రాదు.. ఉండదు. నీవు ఓ బాల్‌ను చెత్తగా ఆడితే.. అవుటవ్వడం ఖాయమనే విషయాన్ని మైండ్‌లో పెట్టుకొంటాను అని కొహ్లీ అన్నాడు.

ఆటగాళ్లు సర్వం సిద్ధమని

జట్టు విజయం సాధించాలంటే ఆట ఒక్కటే కారణం కాదు. వాతావరణ పరిస్థితులు, ప్రేక్షకుల ఒత్తిడి, ఆటగాళ్ల మానసిక పరిస్థితి ఇవన్నీ విజయంలో భాగమే. వాతావరణం అనుకూలిస్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఆటగాళ్లు విజయాన్ని అందుకొనేందుకు సిద్దంగా ఉన్నారు. పాక్‌తో మ్యాచ్ సర్వం సిద్ధమై భారత ఆటగాళ్లు సమరోత్సాహంతో రెడీగా ఉన్నారు అని కొహ్లీ పేర్కొన్నారు.

{headtohead_cricket_3_5}

Story first published: Sunday, June 16, 2019, 10:18 [IST]
Other articles published on Jun 16, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+