For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Virat Kohli: నన్ను కొనే అవకాశం ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు.. కోహ్లీ భావోద్వేగం

Virat Kohli About His Future In IPL 2022

2008లో ఐపీఎల్ టోర్నీ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఆర్సీబీ జట్టులో విరాట్ కోహ్లీ ప్లేయర్‌గా ఉన్నాడు. తన కెరీర్ ప్రారంభంలో చాలా ఫ్రాంచైజీలు తనను ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నా ఎవరూ తనపై విశ్వాసంతో మద్దతు చూపి కొనలేదని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో మొత్తం 15సీజన్లలో ఒకే జట్టు కోసం ఆడిన ఏకైక క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. 2008నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున కోహ్లీ ఆడుతూనే ఉన్నాడు.

తొలి మూడేళ్లు నాకు అందిన అవకాశాలే కీలకం

తొలి మూడేళ్లు నాకు అందిన అవకాశాలే కీలకం

స్టార్ స్పోర్ట్స్‌లో ఆర్సీబీ ఫ్రాంచైజీ షోలో కోహ్లీ మాట్లాడుతూ.. "ఐపీఎల్లో తొలి మూడు సంవత్సరాలలో ఆర్సీబీ ఫ్రాంచైజీ తనకు కల్పించిన అవకాశాలు, అందించిన సహకారం చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే చాలా ఫ్రాంఛైజీలు నన్ను ఎంచుకునే అవకాశముంది. కానీ ఏ ఫ్రాంచైజీ నన్ను తీసుకోవడానికి గానీ, నాకు అవకాశాలు ఇవ్వడానికి గానీ మద్దతు ఇవ్వలేదు.' అని పేర్కొన్నాడు.

అప్పట్లో ఢిల్లీకి అవకాశం ఉన్నా..

అప్పట్లో ఢిల్లీకి అవకాశం ఉన్నా..

అయితే అప్పట్లో ఢిల్లీ ప్లేయర్ అయిన కోహ్లీని ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ఇప్పుటి ఢిల్లీ క్యాపిటల్స్) జట్టు డ్రాఫ్ట్ పద్ధతిలో హోం టీం ప్లేయర్‌గా కోహ్లీని తీసుకునే అవకాశముంది. అంతకుముందు చాలా కొన్ని రోజుల క్రితమే కోహ్లీ అండర్ 19జట్టుకు కెప్టెన్సీ వహించి ప్రపంచకప్ గెలిచాడు. మంచి గుర్తింపు ఉన్నప్పటికీ కోహ్లీని తీసుకోకుండా అప్పుడు ఢిల్లీ ఫ్రాంచైజీ ప్రదీప్ సాంగ్వాన్‌ను ఎంచుకుంది. ఆ తొలి సీజన్లో కోహ్లీని ఆర్సీబీ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. ఇక అప్పటి నుండి కోహ్లీ 217ఐపీఎల్ మ్యాచ్‌లలో ఆర్సీబీ తరఫున ఆడాడు. అలాగే ఐపీఎల్లోనే అత్యధికంగా 6,469పరుగులు చేశాడు.

ఎప్పటికీ ఆర్సీబీయన్‌గానే

ఎప్పటికీ ఆర్సీబీయన్‌గానే

ఇక కోహ్లీ 2013లో ఆర్సీబీ జట్టుకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. 2021 సీజన్ వరకు కెప్టెన్‌గా కొనసాగాడు. అతను మొత్తం 140మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించగా.. అందులో 66 మ్యాచ్‌లలో గెలిచాడు, 70 మ్యాచ్‌లలో ఓడిపోయాడు. ఐపీఎల్ 2022 మెగావేలానికి ముందు ఆర్సీబీ కోహ్లీని రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ టైంలో కోహ్లీ.. తాను ఎప్పటికీ ఆర్సీబీ ప్లేయర్‌గానే ఉంటానని ప్రకటించాడు.

నా మనసు చెప్పిందే విన్నాను

నా మనసు చెప్పిందే విన్నాను

'నిజం చెప్పాలంటే నేను ఆర్సీబీ తరఫున రిటైన్ కావొద్దని.. ఎలాగైనా వేలంలోకి రావాలని, నా పేరును వేలం జాబితాలో ఉంచాలని చాలా మంది చాలా రకాలుగా సూచించారు. అయినా నా మనసు చెప్పిందే విన్నా. మనముందు ఎన్నో ట్రోఫీలు గెలుచుకున్న గొప్పవాళ్లు చాలా మంది ఉండొచ్చు. కానీ ఎవరూ వారిని ఎప్పటికీ అతనో ఐపీఎల్ ఛాంపియన్, ప్రపంచకప్ ఛాంపియన్ అంటూ సంబోధించారు. మీరు మంచి ప్లేయర్ అయితే మాత్రం.. తప్పకుండా మిమ్మల్సి గుర్తుంచుకుంటారు. నా జీవితం కూడా అంతే. నాకు ఓ జట్టుకు విధేయుడిగా, మంచి ప్లేయర్‌గా ఉండడమే ఇష్టం' అని కోహ్లీ తన మనోగతాన్ని తెలియజేశాడు.

నా వెనకాల ఎవరెన్నీ మాట్లాడినా బాధపడను

నా వెనకాల ఎవరెన్నీ మాట్లాడినా బాధపడను

ఐపీఎల్‌లో 15ఏళ్లుగా ఆర్‌సీబీకి ప్రాతినిధ్యం వహించినా.. ఐపీఎల్ ట్రోఫీ ముద్దాడాలనే కల కోహ్లీకి తీరలేదు. అయినప్పటికీ తనకు ఎలాంటి రిగ్రెట్ లేదని కోహ్లీ పేర్కొన్నాడు. నా వెనకాల ఎవరెన్నీ మాట్లాడుకున్నా నేను బాధపడను. ఓ క్రికెటర్‌గా నాకు నా మీద ఉండే ఒపినియన్ బాగుంది అది చాలు అంటూ స్పష్టం చేశాడు.

Story first published: Wednesday, May 4, 2022, 17:04 [IST]
Other articles published on May 4, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+