
హైదరాబాద్: చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(84; 49 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు), ఏబీ డివిలియర్స్(63; 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు)లు హాఫ్ సెంచరీలు నమోదు చేయడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు పార్థివ్ పటేల్(25), కోహ్లీ(84)లు తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించారు. పార్ధీవ్ పటేల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఏబీ డివిలియర్స్‌తో కలిసి కోహ్లీ పరుగుల వరద పారించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 108 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 17వ ఓవర్లో జట్టు స్కోరు 172 పరుగుల వద్ద కోహ్లీ ఔటయ్యాడు.
ఐపీఎల్‌లో కోహ్లీకి ఇది 35వ హాఫ్ సెంచరీ. ఈ క్రమంలో ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సురేశ్ రైనాను కోహ్లీ అధిగమించాడు. కోహ్లీ ఔటైన కొద్దిసేపటికే డివిలియర్స్ కూడా పెవిలియన్ చేరాడు. అయితే, చివర్లో స్టోయినిస్ (28, 13 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సు) దూకుడుగా ఆడటంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.
కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్, కుల్దీప్ యాదవ్, నితీశ్ రాణాలకు తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కేకేఆర్ తుది జట్టులో సునీల్ నరేన్‌కి చోటు దక్కించుకున్నాడు. ఇక, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా ఒక మార్పుతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌తో ఈ సీజన్‌లో టిమ్ సౌథీ అరంగేట్రం చేశాడు.
ఈ సీజన్‌లో ఆర్సీబీ ఇంతవరకు గెలుపు రుచిని చూడలేకపోయింది. ఈ మ్యాచ్‌లో గనుక ఆర్సీబీ ఓడిపోతే ప్లేఆఫ్ ఆశలు మరింత కష్టమవుతాయి. టోర్నీ ఆరంభానికి ముందు టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీ వరుస ఓటములతో అభిమానులు సైతం నిరాశకు లోనవుతున్నారు. ఇప్పటి వరకూ రెండు జట్లూ 23 మ్యాచుల్లో తలపడగా 14 సార్లు కోల్‌కతా, 9 సార్లు బెంగళూరు విజయాలు సాధించాయి.
ఈ సీజన్‌లో కోల్‌కతా మూడు మ్యాచ్‌లాడి రెండింట విజయం సాధించగా... ఆర్సీబీ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది. ఈ నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఆర్సీబీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. సీఎస్‌కే జరిగిన మ్యాచ్‌లో పిచ్ ప్రభావం, ముంబైతో జరిగిన రెండో మ్యాచ్‌లో అంపైర్ తప్పిదం, సన్‌రైజర్స్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో బ్యాటింగ్ విఫలం... చివరగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టు సమిష్టి విఫలం ఇలా బెంగళూరు ఓటమిపాలైంది.
జట్ల వివరాలు:
బెంగళూరు: విరాట్ కోహ్లీ, పార్థివ్ పటేల్, ఏబీ డివిలియర్స్, స్టొయినీస్, మెుయిన్ అలీ, శివమ్ దూబె, అక్షదీప్ నాథ్, టిమ్ సౌథీ, ఉమేశ్‌యాదవ్, నవదీప్ సైనీ, యుజువేంద్ర చాహల్.
కోల్‌కతా: దినేశ్ కార్తీక్(కెప్టెన్, వికెట్ కీపర్), క్రిస్ లిన్, సునీల్‌నరైన్, నితీశ్ రాణా, రాబిన్‌ఉతప్ప, శుభ్‌మన్ గిల్, అండ్రీ రసెల్, పియూష్‌చావ్లా, ఫెర్గూసన్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ.