కోహ్లీ, ఏబీ వన్డే జట్టు.. కెప్టెన్‌గా ధోనీ!!

ఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమైన క్రికెటర్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లోనే ఉంటున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. ఆడినంత కాలం ఆర్‌సీబీ తరఫునే ప్రాతినిధ్యం వహిస్తానని కోహ్లీ అంటే.. డివిలియర్స్ కూడా బెంగళూరు జట్టును వీడనని తెలిపాడు.

కెప్టెన్‌గా ధోనీ:
ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో భాగంగా విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ కలిసి భారత్-దక్షిణాఫ్రికా సంయుక్త వన్డే జట్టును ఎంపిక చేసారు. ఈ వన్డే జట్టుకు మహేంద్ర సింగ్ ధోనీని కెప్టెన్‌గా నియమించారు. సంయుక్త వన్డే జట్టుకు ధోనీ కెప్టెన్ అయితే బాగుంటుందని ఇద్దరు సూచించారు. జట్టులో కోహ్లీ, డివిలియర్స్, ధోనీతో పాటు సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, జాక్వస్ కలిస్, యువరాజ్సింగ్, యుజువేంద్ర చాహల్, డేల్ స్టెయిన్, జస్ప్రీత్ బుమ్రా, కాగిసో రబాడ ఉన్నారు.

కిట్‌ల వేలం:
కరోనా వైరస్‌పై పోరాటంలో పేద ప్రజలను ఆదుకునేందుకు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ సిద్ధమయ్యారు. 2016 ఐపీఎల్‌లో గుజరాత్ లయన్స్‌తో మ్యాచ్‌లో ఇద్దరు సెంచరీలు చేసినప్పటి జెర్సీలు, బ్యాట్లు, గ్లౌవ్స్ వేలం వేయబోతున్నారు. ఈ మ్యాచ్‌లో డివిలియర్స్ 52 బంతుల్లో 10 ఫోర్లు, 12 సిక్సర్లతో 129 పరుగులు చేసి అజేయంగా నిలవగా.. 55 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో కోహ్లీ 109 పరుగులు చేశాడు. పర్యావరణాన్ని ప్రోత్సహించే క్రమంలో ఆ రోజు ఆర్‌సీబీ గ్రీన్ జెర్సీలతో బరిలోకి దిగింది.

ఆఖరి వరకు ఆర్‌సీబీతోనే:
ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'ఆర్‌సీబీతో ప్రయాణం ఓ అద్భుతం. ఐపీఎల్ కప్‌ను సాధించడం మా కల. అయితే సీజన్‌లో మెరుగ్గా రాణించలేకపోయామనే బాధ ఉండొచ్చు. కానీ.. బెంగళూరు నుంచి వెళ్లిపోయే ఆలోచన అస్సలు లేదు. ఈ జట్టును ఎప్పటికీ వదిలి వెళ్లను. అభిమానులు, వారి విధేయత ఎంతో గొప్పగా ఉంటుంది. అభిమానులు చూపే ప్రేమ ఎప్పటికీ మరచిపోను' అని అన్నాడు. ఐపీఎల్‌లోకి వచ్చే యువకులు పరుగుల వరద పారించాలని కోహ్లీ సూచించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications