ఆసీస్ గడ్డపై మరో అరుదైన ఘనతకు 8 పరుగుల దూరంలో కోహ్లీ

హైదరాబాద్: ఆస్ట్రేలియా మైదానాలంటే చాలు విరాట్ కోహ్లీ విజృంభించాడు. 2014-15లో ఆసీస్ గడ్డపై చివరిసారిగా భారత్ జట్టు నాలుగు టెస్టుల సిరీస్ ఆడింది. ఆ పర్యటనలో విరాట్ కోహ్లీ మొత్తం 8 ఇన్నింగ్స్‌ల్లో 692 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి.
ఈ సిరిస్‌లో స్టీవ్ స్మిత్(769) తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. మళ్లీ మూడేళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడేందుకు వచ్చింది. అయితే, ఈసారి ఆస్ట్రేలియా గడ్డపై అరుదైన రికార్డ్స్‌కి చేరువలో కోహ్లీ ఉన్నాడు.
గురువారం నుంచి అడిలైడ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుండగా.. అందరి కళ్లూ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీపైనే ఉన్నాయి. టెస్టు సిరిస్‌కు ముందు సిడ్నీ వేదికగా క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీలతో చెలరేగాడు.

8 టెస్టులాడి 992 పరుగులు
గురువారం నుంచి ఆరంభమయ్యే టెస్టు సిరిస్‌లో సైతం కోహ్లీ మరోసారి చెలరేగుతాడని మాజీ క్రికెటర్లు జోస్యం చెప్తున్నారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకోనున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై 2012, 2014-15లో పర్యటించిన కోహ్లీ ఇప్పటి వరకు 8 టెస్టులాడి 992 పరుగులతో కొనసాగుతున్నాడు.

కోహ్లీ మరో 8 పరుగులు సాధిస్తే
కోహ్లీ మరో 8 పరుగులు సాధిస్తే ఆస్ట్రేలియా గడ్డపై 1,000 పరుగుల మైలురాయిని అందుకున్న నాలుగో భారత్ క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించనున్నాడు. ఇప్పటివరకు ఈ జాబితాలో వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్‌లు మాత్రమే ఈ ఘనత అందుకున్నారు.

కెప్టెన్‌గా మరో రికార్డుకి 13 పరుగుల దూరంలో
దీంతో పాటు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా మరో రికార్డుకి 13 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ నాలుగేళ్లలో భారత్ వెలుపల టెస్టుల్లో 1,987 పరుగులు చేసిన కోహ్లీ ఆస్ట్రేలియాపై గురువారం నుంచి జరగనున్న సిరీస్‌లో మరో 13 పరుగులు చేస్తే విదేశాల్లో 2,000 పరుగులు చేసిన తొలి భారత్ కెప్టెన్‌గా చరిత్ర సృష్టించనున్నాడు.

1947 నుంచి ఇప్పటివరకు టీమిండియా
ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా గడ్డపై సుదీర్ఘకాలంగా పర్యటిస్తున్న భారత్ జట్టు ఇప్పటి వరకు ఒక్క టెస్టు సిరీస్‌ని కూడా గెలవలేదు. 1947 నుంచి ఇప్పటివరకు టీమిండియా మొత్తం 12 సార్లు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లగా 9 సార్లు ఆతిథ్య విజయం సాధించగా, కేవలం మూడు సార్లు టెస్టు సిరిస్‌లను డ్రా చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈసారి టెస్టు సిరీస్‌ని గెలిచిన తొలి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాలని కోహ్లీ ఉవ్విళ్లూరుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications