14 వేల పరుగులు, 51 సెంచరీలు.. వన్డే ఫార్మాట్ లోనే గ్రేటెస్ట్ బ్యాటర్ గా పేరు గాంచిన విరాట్ కోహ్లీ సాధించిన రికార్డులివీ. ఇప్పుడతడు తన అంతర్జాతీయ వన్డే కెరీర్‌లో 300వ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా న్యూజిలాండ్ జరగనున్న మ్యాచ్‌తో ఈ 300వ మ్యాచ్ మార్క్ ను టచ్ చేయనున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఈ మ్యాచ్ తో పలు రికార్డులను కూడా బ్రేక్ చేయనున్నాడు. అందులో ఒకటి ఛేజింగ్.
ది అల్టిమేట్ ఛేజర్..
కోహ్లీకి అల్టిమేట్ ఛేజ్ మాస్టర్ గా పేరుంది. కళ్ల ముందు కొండంత లక్ష్యమున్నా దాన్ని తన బ్యాట్ తో పరుగులు చేస్తూ కరిగిస్తుంటాడు. ఇప్పటి అతడు సాధించిన గణాంకాలే ఈ విషయాన్ని చెబుతున్నాయి. రీసెంట్ గా కూడా పాకిస్థాన్ పై సెంచరీ బాది జట్టు లక్ష్యాన్ని ఛేధించడంలో కీలకంగా వ్యవహరించాడు.
The top spot of #ChampionsTrophy Group A will be determined with the #NZvIND clash in Dubai 👀
— ICC (@ICC) March 1, 2025
Match preview ⬇️https://t.co/umKDPrZlVC
మరో 21 పరుగులు చేస్తే..
2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన విరాట్ కోహ్లీ.. వన్డేల్లో 14,085 పరుగులు చేశాడు. అయితే ఈ ఫార్మాట్ లో అతడు మరో 21 పరుగులు చేస్తే లక్ష్య ఛేదన లో 8 వేల పరుగుల క్లబ్‌లోకి చేరే అవకాశం ఉంది. కాబట్టి తాజా న్యూజిలాండ్ మ్యాచ్ లో భారత జట్టు రెండో ఇన్నింగ్స్ ఆడితే అతడు ఈ ఘనతను అందుకోవచ్చు.
అగ్రస్థానంలో సచిన్ తెందుల్కర్..
ప్రస్తుతం కోహ్లీ 158 ఇన్నింగ్స్‌ల్లో 64.34తో 7,979 పరుగులు చేశాడు. ఇందులో 28 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విరాట్ కన్నా ముందు సచిన్ తెందూల్కర్ 232 ఇన్నింగ్స్‌ల్లో 8,720 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ 150 ఇన్నింగ్స్‌ల్లో 6,087 పరుగులతో ఉన్నాడు.
