ఇదో చిన్న మైలురాయి మాత్రమే: ధోని తర్వాత విరాట్ కోహ్లీనే

హైదరాబాద్: టీమిండియా తరపున ప్రాతినిధ్యం వహించడం అదృష్టంగా భావిస్తున్నట్లు టీమిండియా కెప్టెన్ కోహ్లీ తెలిపాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా గురువారం పూణె వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. ఈ టెస్టులో టాస్ గెలిచిన కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
అయితే, ఈ టెస్టులో విరాట్ కోహ్లీ ఖాతాలో ఓ మైలురాయి చేరింది. కెప్టెన్‌గా విరాట్ కోహ్లికి ఇది 50వ టెస్టు. టీమిండియా తరుపున టెస్టుల్లో 50 మ్యాచ్‌లకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన ఆటగాడిగా ఘనత సాధించాడు. అత్యధిక టెస్టు మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన భారత కెప్టెన్ల జాబితాలో సౌరవీ గంగూలీ (49) రికార్డుని కోహ్లీ అధిగమించాడు.
అదృష్టంగా భావిస్తున్నా
60 టెస్టులతో ఈ జాబితోలా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అగ్రస్థానంలో ఉన్నాడు. 2008 నుంచి 2014 మధ్య కాలంలో ధోనీ టీమిండియా టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. టాస్ సందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ
భారత్ తరపున ప్రాతినిధ్యం వహించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు.

ఇదో చిన్న మైలురాయి మాత్రమే
ఇదో చిన్న మైలురాయి అని తన ఫోకస్ మొత్తం మ్యాచ్ గెలుపుమీదే ఉంటుందని కోహ్లీ తెలిపాడు. తన క్రికెట్ కెరీర్‌లో జరిగిన ప్రతి అంశానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కోహ్లీ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఇక, టీమిండియా తరుపున అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి పేరుంది.

29 టెస్టుల్లో విజయం
విరాట్ కోహ్లీ సారథ్యంలో ఇండియా ఇప్పటివరకు 29 టెస్టుల్లో విజయం సాధించగా... పది మ్యాచ్‌లు డ్రా కాగా, పది మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అదే ధోని నాయకత్వంలో టీమిండియా మొత్తం 60 టెస్టులాడగా... 27 టెస్టుల్లో విజయం సాధించగా... 18 మ్యాచ్‌లు డ్రా కాగా, 15 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా కోహ్లీ
ఆస్ట్రేలియా కెప్టెన్లు స్టీవ్ వా, రికీ పాంటింగ్ తర్వాత టెస్టుల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా కోహ్లీకి నిలిచాడు. కోహ్లీ సారథ్యంలోనే ఆసీస్ గడ్డపై టీమిండియా టెస్టు సిరిస్ నెగ్గింది. ఇక, భారత జట్టు సొంతగడ్డపై 2013 నుంచి 30 టెస్టులు ఆడితే 24 గెలిచి ఒకే ఒక్క టెస్టులో ఓడిపోయింది. ఆ ఒక్క ఓటమి ప్రస్తుతం సఫారీలతో రెండో టెస్టు జరుగుతున్న పూణె స్టేడియంలోనే కావడం విశేషం. 2017లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో టీమిండియా ఏకంగా 333 పరుగులతో ఓడిపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications