For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్ రికార్డు బద్దలు: 6 వేల పరుగుల మైలు రాయిని దాటేసిన కోహ్లీ

Virat Kohli 2nd Fastest Indian Behind Sunil Gavaskar To Reach 6000 Runs
Virat Kohli 2nd fastest Indian behind Sunil Gavaskar to reach 6000 Test runs

సౌతాంప్టన్: భారత పరుగుల యంత్రం, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో అండర్‌సన్‌ బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టిన కోహ్లి.. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 6,000 పరుగులు చేసిన రెండో భారతీయ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. అంతేకాదు, సచిన్‌ (120ఇన్నింగ్స్‌ల) రికార్డును సైతం బద్దలు కొట్టాడు.

సునీల్‌ గవాస్కర్‌(117 ఇన్నింగ్స్‌ల్లో )వీరందరికంటే టాప్‌లో ఉండగా, ఆ తర్వాత సెహ్వాగ్‌(121 ఇన్నింగ్స్‌ల్లో ), ద్రవిడ్‌(125ఇన్నింగ్స్‌ల్లో)లు ఉన్నారు. ఇప్పటివరకూ 70 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 119 ఇన్నింగ్స్‌ల్లో 54.61 సగటుతో 6వేల పైచిలుకు పరుగులు చేశాడు. ఇందులో 23 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మ్యాచ్ ముందు వరకూ 69 టెస్టులాడిన విరాట్ కొహ్లీ 118 ఇన్నింగ్స్‌ల్లో 5994 పరుగులు చేశాడు. 2017లో శ్రీలంకతో దిల్లీ వేదికగా జరిగిన టెస్టులో అత్యధికంగా 243 పరుగులు చేశాడు.

అంతర్జాతీయ టెస్టుల్లో అత్యంత వేగంగా అతికొద్ది ఇన్నింగ్స్‌ల్లోనే ఆరు వేల పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియన్ ఆల్ టైమ్ గ్రేట్ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బ్రాడ్‌మన్ కేవలం 68 ఇన్నింగ్స్‌లోనే టెస్ట్‌ల్లో ఆరువేల పరుగుల మైలురాయిని అధిగమించాడు. ఇక, టెస్టుల్లో అతి తక్కవ ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అందుకున్న భారత క్రికెటర్‌గా మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్‌ నిలిచాడు.

1
42377

సునీల్ గవాస్కర్ 117 ఇన్నింగ్స్‌‌ల్లో 6వేల పరుగులు పూర్తి చేశాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే ఆరు వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ 10వ స్థానంలో ఉన్నాడు. సచిన్ తర్వాత ఈ జాబితాలో భారత మాజీ క్రికెటర్లు వీరేందర్ సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్‌లు వరుసగా 12,13 స్థానాల్లో ఉన్నారు. 123 ఇన్నింగ్స్‌లతో సెహ్వాగ్, 125 ఇన్నింగ్స్‌లతో రాహుల్ ద్రావిడ్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

సౌతాంప్టన్ టెస్టులో కోహ్లీ 6 పరుగులు చేసి 6వేల పరుగుల మార్క్ దాటి 119 ఇన్నింగ్స్‌లలోనే సచిన్‌ను వెనక్కునెట్టి 10వ స్థానంలో నిలిచాడు. అంతేకాదు మరో 104 పరుగులు సాధిస్తే.. కెప్టెన్‌గా 4 వేల పరుగుల మైలురాయిని కూడా కోహ్లీ అందుకుంటాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా ఉన్న విరాట్ కొహ్లీ సౌతాంప్టన్ టెస్టులో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డుని బద్దలు కొట్టగలుగుతాడా లేదా అని క్రికెట్ అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Story first published: Friday, August 31, 2018, 18:02 [IST]
Other articles published on Aug 31, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+