For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2017లో కోహ్లీ పరుగుల ప్రభంజనం: అటు క్రికెట్, ఇటు పెళ్లిపై విశ్లేషణ

By Nageshwara Rao

హైదరాబాద్: 2017వ సంవత్సరం విరాట్ కోహ్లీకి బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శన చేయడంతో పాటు తన బ్యాచిలర్ లైఫ్‌కి ముగింపు పలికాడు. డిసెంబర్ 11న ఇటలీలోని టస్కనీలో తన ప్రేయసి అనుష్క శర్మను వివాహం చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. ఇక క్రికెట్ విషయానికి వస్తే ఈ ఏడాది 10 టెస్టులాడిన కోహ్లీ 1059 పరుగులు.. 26 వన్డేల్లో 1460... 10 టీ20ల్లో 299 పరుగులు సాధించాడు.

2017లో విరాట్ కోహ్లీ ప్రదర్శనను ఒక్కసారి పరిశీలిద్దాం...

 టెస్టుల

టెస్టుల

ఈ ఏడాది టీమిండియా స్వదేశంలో ఎక్కువ టెస్టు సిరిస్‌లను ఆడింది. బంగ్లాదేశ్‌తో హైదరాబాద్ వేదికగా జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఇక ఆస్ట్రేలియాతో ఆడిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో కోహ్లీ విఫలమయ్యాడు. మూడు టెస్టుల్లో 46 పరుగులు చేయగా, గాయం కారణంగా నాలుగో టెస్టు మ్యాచ్‌కి దూరమయ్యాడు. ఇక శ్రీలంకతో జరిగిన ఆరు టెస్టుల్లో కూడా కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు.

2017లో టెస్టుల్లో కోహ్లీ:

టెస్టు మ్యాచ్‌లు: 10

పరుగులు: 1059 runs

అత్యధిక స్కోరు: 243 against Sri Lanka in Delhi

యావరేజి: 75.64

100s: 5

 వన్డేలు:

వన్డేలు:

ఇక, వన్డే క్రికెట్ విషయానికి వస్తే కోహ్లీకి ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. కెప్టెన్‌గా కోహ్లీ దూకుడుగా ఆడుతూ జట్టుని ముందుండి నడిపించాడు. ఒంటి చేత్తో జట్టుకు అనేక విజయాలనందించాడు. వన్డేల్లో ఈ మ్యాచ్‌లో కోహ్లీ పరుగులు చేయలేదు అని అనుకోవడానికి వీల్లేదు. ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డేలో కోహ్లీ 122 పరుగులతో చెలరేగాడు. ఈ ఏడాది వన్డేల్లో 6 సెంచరీలతో 1460 పరుగులు నమోదు చేశాడు. ఇక న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరిస్‌లో కోహ్లీ రెండు సెంచరీలు చేశాడు.

2017లో వన్డేల్లో కోహ్లీ:

వన్డే మ్యాచ్‌లు: 26

పరుగులు: 1,460 runs

అత్యధిక స్కోరు: 131 against Sri Lanka in Colombo

యావరేజి: 76.84

100s: 6

 టీ20లు:

టీ20లు:

ఈ ఏడాది భారత్ తరుపున విరాట్ కోహ్లీ 10 టీ20లు ఆడాడు. టీ20ల్లో కూడా విరాట్ కోహ్లీ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. టీ20ల్లో రెండు హాఫ్ సెంచరీలను నమోదు చేశాడు. టీ20ల్లో అత్యధిక స్కోరు 82 గా ఉంది. ఇక, టీ20 ఫార్మాట్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున 308 పరుగులు నమోదు చేశాడు.

2017లో టీ20ల్లో కోహ్లీ:

టీ20 మ్యాచ్‌లు: 10

పరుగులు: 299 runs

అత్యధిక స్కోరు: 82 against Sri Lanka in Colombo

యావరేజి: 37.37

50s: 2

 2017లో విరాట్ కోహ్లీ నమోదు చేసిన రికార్డులివే

2017లో విరాట్ కోహ్లీ నమోదు చేసిన రికార్డులివే

  • వీటితో పాటు ఈ ఏడాది కోహ్లీ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ రెండో స్ధానంలో నిలిచాడు. ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లీ 2818 పరుగులు నమోదు చేశాడు.
  • ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అగ్రస్ధానంలో నిలిచాడు.
  • శ్రీలంకతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో విరాట్ కోహ్లీ 610 పరుగులు సాధించాడు. ఇది కోహ్లీకి టెస్టుల్లో నాలుగో అత్యధికం కావడం విశేషం. ఇందులో కోహ్లీ కేవలం ఐదు ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడాడు.
  • 2017లో విరాట్ కోహ్లీ 6 సెంచరీలు నమోదు చేశాడు. దీంతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్ధానంలో నిలిచాడు. వన్డేల్లో కోహ్లీ (32) సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (49) అగ్రస్ధానంలో ఉన్నాడు.
  • కెప్టెన్‌గా అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన వెస్టిండిస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా రికార్డుని విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. ఈ ఏడాది కెప్టెన్‌గా కోహ్లీ ఆరు డబుల్ సెంచరీలు నమోదు చేశాడు.
  • కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ (13) అగ్రస్ధానంలో ఉన్నాడు.
  • అనుష్కతో పెళ్లి

    అనుష్కతో పెళ్లి

    డిసెంబర్ 11న ఇటలీలోని టస్కనీలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లికి ఇరు కుటుంబాలకు చెందిన అతికొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. హనీమూన్‌ కోసం విరుష్క జంట ప్రస్తుతం రోమ్‌లో పర్యటిస్తోంది. పెళ్లి అనంతరం సన్నిహితులు, బంధువుల కోసం ఢిల్లీ, ముంబైలో ఇద్దరు విందు ఇవ్వనున్నారు. డిసెంబర్ 21న ఢిల్లీలో... డిసెంబర్ 26న ముంబైలో రిసెప్షన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ రిసెప్షన్‌కు అటు బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు క్రికెట్ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. రిసెప్షన్ల కోసం సెపరేట్‌గా ఇన్విటేషన్ కార్డును కూడా పంచిన సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, December 19, 2017, 12:08 [IST]
Other articles published on Dec 19, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+