Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

No.1 ర్యాంకు: స్మిత్‌ను అధిగమించడానికి 2 పాయింట్ల దూరంలో కోహ్లీ!

Virat Kohli 2 Points Away From No.1 Test Batsman || Oneindia Telugu
Virat Kohli 2 points away from overtaking Steve Smith as top Test batsman

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు ర్యాంకింగ్స్‌లో No.1 స్థానానికి మరింత చేరువవయ్యాడు. పూణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో విరాట్ కోహ్లీ తన కెరీర్ బెస్ట్ 254 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం ఐసీసీ ప్రకటించిన ర్యాంకుల్లో విరాట్ కోహ్లీ అగ్రస్థానానికి 2 పాయింట్ల దూరంలో నిలిచాడు.

ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్(937 పాయింట్లు)తో అగ్రస్థానంలో నిలవగా... విరాట్ కోహ్లీ(936) పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది టెస్టుల్లో విరాట్ కోహ్లీకి ఇదే తొలి సెంచరీ. ఈ ఏడాది టెస్టుల్లో తొలి సెంచరీని సాధించడానికి కోహ్లీకి 9 ఇన్నింగ్స్‌ల సమయం పట్టింది. అంతకముందు 8 ఇన్నింగ్స్‌ల్లో విరాట్ కోహ్లీ రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు.

టెస్టుల్లో 7వ డబుల్ సెంచరీ

టెస్టుల్లో 7వ డబుల్ సెంచరీ

ఈ క్రమంలో విరాట్ కోహ్లీ టెస్టుల్లో 7వ డబుల్ సెంచరీ సాధించాడు. కోహ్లీ డబుల్ సెంచరీ సాధించడంతో టీమిండియా ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. అయితే, స్టీవ్ స్మిత్ ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన సమయంలో టెస్టుల్లో విరాట్ కోహ్లీ No.1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

ఈ ఏడాది ఒకే ఒక సెంచరీ

ఈ ఏడాది ఒకే ఒక సెంచరీ

యాషెస్ సిరిస్‌తో స్టీవ్ స్మిత్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి పునరాగమనం చేయడంతో పాటు అద్భుత ప్రదర్శన చేశాడు. ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో 110.57 యావరేజితో 774 పరుగులు చేసి తిరిగి టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. మరోవైపు జనవరి 2018 నుంచి కోహ్లీ ఒక్క సెంచరీ కూడా చేయకపోవడంతో టెస్టుల్లో యావరేజి తగ్గింది.

రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రెండు సెంచరీలు చేసిన రోహిత్

రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రెండు సెంచరీలు చేసిన రోహిత్

విశాఖ వేదికగా జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 20 పరుగులకే పరిమితమైన విరాట్ కోహ్లీ... రెండో ఇన్నింగ్స్‌లో 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు రోహిత్ శర్మ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రెండు సెంచరీలతో మెరవడంతో తొలి టెస్టులో టీమిండియా 203 పరుగుల తేడాతో విజయం సాధించింది.

విరాట్ కోహ్లీకి తోడు రహానే సైతం

విరాట్ కోహ్లీకి తోడు రహానే సైతం

రెండో టెస్టులో విరాట్ కోహ్లీకి తోడు రహానే సైతం రాణించడంతో టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు దక్షిణాఫ్రికాతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో రాణిస్తోన్న టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 17వ స్థానంలో నిలిచి తొలిసారి తన కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకుని అందుకున్నాడు.

మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ

మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ

విశాఖ వేదికగా జరిగిన తొలి టెస్టులో మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. టెస్టుల్లో మయాంక్ అగర్వాల్‌కి ఇదే తొలి సెంచరీ. మరోవైపు పూణె వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ మయాంక్ అగర్వాల్ సెంచరీతో మెరిశాడు. ఇక, బౌలర్ల విషయానికి వస్తే జడేజా, అశ్విన్, ఉమేశ్ యాదవ్‌లు తమ స్థానాలను మరింతగా మెరుగుపరచుకున్నారు.

Story first published: Monday, October 14, 2019, 18:18 [IST]
Other articles published on Oct 14, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+