ధోనీ రికార్డు బ్రేక్.. కెప్టెన్‌గా కోహ్లీ మరో సరికొత్త రికార్డు!!

బెంగళూరు: టీమిండియా కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో మైలురాయిని అందుకున్నాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ (91 బంతుల్లో 8 ఫోర్లతో 89) హాఫ్ సెంచరీ చేసాడు. అయితే భారీ షాట్ ఆడే క్రమంలో పేసర్ హజిల్‌వుడ్ బౌలింగ్‌లో బోల్డ్ అయి 89 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. 89 పరుగులు చేసే క్రమంలో కోహ్లీ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

కెప్టెన్‌గా కోహ్లీ సరికొత్త రికార్డు:
మూడో వన్డేలో 89 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు సాధించిన భారత సారధిగా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరిట ఉంది. ధోనీ 330 ఇన్నింగ్స్‌ల్లో 11,207 పరుగులు చేసాడు. అయితే కోహ్లీ మాత్రం కేవలం 199 ఇన్నింగ్స్‌ల్లో 11,208 పరుగులు సాధించి ధోనీ రికార్డును బ్రేక్ చేసాడు.

అజారుద్దీన్@3:
టీమిండియా మాజీ దిగ్గజాలు మహమ్మద్ అజారుద్దీన్ (8,095 పరుగులు-230 ఇన్నింగ్స్‌ల్లో), సౌరవ్ గంగూలీ (7643 పరుగులు-217 ఇన్నింగ్స్‌ల్లో)లు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. కోహ్లీ టెస్టుల్లో 7,202 పరుగులు, వన్డేల్లో 11,792 పరుగులు, టీ20ల్లో 2,689 పరుగులు చేసాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 70 సెంచరీలు, 104 అర్ధ సెంచరీలు ఖాతాలో ఉన్నాయి.

అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 7,000 పరుగులు:
లక్ష్య ఛేదనలో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 7,000 పరుగులు పూర్తిచేసిన బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ (133 ఇన్నింగ్స్‌ల్లో) మరో రికార్డు నెలకొల్పాడు. ఛేజింగ్‌లో 7 వేలు అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా కోహ్లి నిలిచాడు. ఈ జాబితాలో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ 232 ఇన్నింగ్స్‌ల్లో 8,720 పరుగులతో అగ్ర స్థానంలో ఉన్నాడు.

కెప్టెన్‌గా 5000 పరుగులు:
మిచెల్ స్టార్క్ వేసిన 23 ఓవర్ మూడో బంతిని ఎక్స్‌ట్రా కవర్స్ దిశగా బౌండరీ తరలించిన కోహ్లీ.. అంతర్జాతీయ వన్డేల్లో కెప్టెన్‌గా 5000 పరుగులు పూర్తిచేసుకున్నాడు. దీంతో అత్యంత వేగంగా 5000 పరుగులు పూర్తిచేసిన తొలి కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. 82 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ ఈ ఫీట్ సాధించగా.. ధోనీ 127 ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని అందుకున్నాడు. రికీ పాంటింగ్ (131 ఇన్నింగ్స్‌ల్లో), గ్రేమ్ స్మిత్ (135 ఇన్నింగ్స్‌ల్లో), సౌరవ్ గంగూలీ (136 ఇన్నింగ్స్‌ల్లో) కెప్టెన్‌గా 5000 పరుగులు పూర్తి చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications