కోహ్లీ 5000: భారత్ తరుపున 11వ ఆటగాడిగా అరుదైన ఘనత

హైదరాబాద్: ఫిరోజ్ షా కోట్లా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు, తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో విరాట్ కోహ్లీ 5000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఢిల్లీ టెస్టులో తొలిరోజు 25 పరుగులు పూర్తి చేయగానే కోహ్లీ ఈ ఘనత సాధించాడు.
విరాట్ కోహ్లీకి ఇది 63వ టెస్టు. ఇన్నింగ్స్‌లో లక్మల్ వేసిన 30.3వ బంతిని బౌండరీకి తరలించి కోహ్లీ 5000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా భారత్ తరఫున అత్యంత వేగంగా ఐదు వేల పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. 105 ఇన్నింగ్స్‌ల్లోనే విరాట్ కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు.
ఇక, మొత్తంగా చూస్తే భారత్ తరఫున టెస్టు క్రికెట్లో 5వేల పరుగుల క్లబ్‌లో చేరిన 11వ ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. ఇక, సమయం పరంగా చూస్తే భారత్ తరఫున 2,358 రోజుల్లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. ద్రవిడ్ 2,252 రోజులతో అందరికంటే ముందున్నాడు. సచిన్ (25 ఏళ్ల 301 రోజులు) తర్వాత ఈ ఘనత సాధించిన పిన్క వయస్కుడిగా కోహ్లీ (29 ఏళ్ల 27 రోజులు) నిలిచాడు.
భారత్ తరఫున టెస్టుల్లో అత్యంత వేగంగా 5000 పరుగుల మైలురాయిని అందుకున్న రికార్డు క్రికెట్ లెజెండ్ సునీల్ గావస్కర్ పేరిట ఉంది. గవాస్కర్ 95 ఇన్నింగ్స్‌ల్లోనే 5000 పరుగులు పూర్తి చేశాడు. సెహ్వాగ్ 99 ఇన్నింగ్స్‌ల్లో, సచిన్ 103 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరుకున్నారు.
ప్రస్తుత క్రికెటర్లలో ఆసీస్ కెప్టెన స్టీవ్ స్మిత్ మాత్రమే కోహ్లీ కంటే వేగంగా 5000 పరుగులు మైలురాయిని అందుకున్నాడు. స్టీవ్ స్మిత్ 97 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ జోయ్ రూట్ కూడా 105 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా, కేన్ విలియమ్సన్ 110 ఇన్నింగ్సుల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్నారు.
ఇదిలా ఉంటే ఢిల్లీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు, తొలి ఇన్నింగ్స్‌లో భారత్ లంచ్ విరామానికి 2 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications