Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Kohli 100th Test Toss: మ‌న‌దే బ్యాటింగ్‌.. మూడో స్థానంలో హనుమ విహారీ.. అంద‌రి క‌ళ్లు విరాట్ కోహ్లీపైనే!

Virat kohli 100th Test: India Won the Toss And opt to bat

మొహాలీ: భార‌త్, శ్రీ‌లంక తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా మొద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది. టెస్ట్ ఫార్మాట్‌లో కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ‌కు ఇదే తొలి టెస్ట్ మ్యాచ్‌. అలాగే వెట‌ర‌న్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌తో 100 టెస్టు మ్యాచ్‌ల మైలు రాయిని చేరుకోబోతున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లో అంద‌రి క‌ళ్లు విరాట్ కోహ్లీపైనే నెల‌కొన్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆరుగురు బ్యాట‌ర్లు, ఐదుగురు బౌల‌ర్ల‌తో బ‌రిలోకి దిగుతుంది. ఐదుగురు బౌల‌ర్ల‌లో ముగ్గురు స్పిన్న‌ర్లు, ఇద్ద‌రు పేస్ బౌల‌ర్లు ఉన్నారు.

 రోహిత్ శ‌ర్మ ఏమ‌న్నాడంటే..

రోహిత్ శ‌ర్మ ఏమ‌న్నాడంటే..

''మేము ముందుగా బ్యాటింగ్ చేయబోతున్నాం. ఇలాంటి పిచ్‌ల్లో మొద‌ట బ్యాటింగ్ చేసి బోర్డుపై ఎక్కువ ప‌రుగులు పెట్టాల‌నుకుంటున్నాం. అలాగే ఆ స్కోర్‌ను కాపాడుకోవ‌డం కూడా చాలా ముఖ్యం. టీమిండ‌యాకు టెస్టుల్లో కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌డం నాకు ద‌క్కిన గొప్ప గౌర‌వం. టీమిండియాకు టెస్ట్ కెప్టెన్ అవుతాన‌ని నేను క‌ల‌లో కూడా ఊహించ‌లేదు. ఇది ప్ర‌త్యేకమైన మ్యాచ్‌. విరాట్ కోహ్లీ 100వ టెస్టు మ్యాచ్ ఆడ‌డం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో మేము ముగ్గురు స్పిన్న‌ర్లు, ఇద్ద‌రు సీమ‌ర్లు, ఆరుగురు బ్యాట‌ర్ల‌తో బ‌రిలోకి దిగుతున్నాం.'' అని రోహిత్ శ‌ర్మ తెలిపాడు.

క‌రుణర‌త్నే ఏమ‌న్నాడంటే..

క‌రుణర‌త్నే ఏమ‌న్నాడంటే..

''మేం కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం. మేము ముగ్గురు సీమర్లు, ఇద్ద‌రు స్పిన్న‌ర్ల‌తో ఆడుతున్నాము. ఆరుగురు బ్యాట‌ర్ల‌తో ఆడుతున్నాం. ఇది బ్యాటింగ్ చేయడానికి మంచి వికెట్. మేం 300 టెస్టులు ఆడాం. కానీ భారత్‌లో ఎప్పుడూ గెలవలేదు. మాకు సీనియర్, జూనియర్ కాంబినేషన్‌తో మంచి టీమ్ ఉంది.'' అని శ్రీ‌లంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే చెప్పాడు.

 మూడో స్థానంలో హ‌నుమ విహారీ

మూడో స్థానంలో హ‌నుమ విహారీ

ఈ మ్యాచ్‌లో తెలుగు ఆట‌గాడు హ‌న‌మ విహారీ మూడో స్థానంలో ఆడ‌నున్నాడు. రోహిత్‌కు జ‌త‌గా మ‌యాంక్ అగ‌ర్వాల్ ఇన్నింగ్స్ ఓపెన్ చేయ‌నుండ‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు. అశ్విన్, జ‌డేజాతోపాటు జ‌యంత్ యాద‌వ్ స్పిన్ కోటాను పంచుకోనున్నాడు.

తుది జ‌ట్లు:

తుది జ‌ట్లు:

శ్రీలంక: దిముత్ కరుణరత్నే(కెప్టెన్‌), లహిరు తిరిమన్నె, పాతుమ్ నిస్సంక, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, నిరోషన్ డిక్వెల్లా(వికెట్ కీప‌ర్), సురంగ లక్మల్, విశ్వ ఫెర్నాండో, లసిత్ ఎంబుల్దెనియా, లహిరు కుమార.

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్‌), మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీప‌ర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.

Story first published: Friday, March 4, 2022, 11:25 [IST]
Other articles published on Mar 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+