ప్రపంచ రికార్డుకు పరుగు దూరంలో విరాట్ కోహ్లీ

హైదరాబాద్: కొత్త సంవత్సరంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఓ ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. మరో పరుగు సాధిస్తే టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ ప్రపంచ రికార్డు సాధిస్తాడు. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. ఆదివారం గువహటి వేదికగా శ్రీలంకతో తొలి టీ20లో టీమిండియా తలపడనుంది.
అంతర్జాతీయ టీ20 పరుగుల్లో రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లీ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 104 టీ20ల్లో 2,633 పరుగులు సాధించగా... విరాట్ కోహ్లీ 75 మ్యాచుల్లోనే ఈ పరుగులు చేయడం విశేషం. అయితే, శ్రీలంకతో ప్రారంభమయ్యే మూడు టీ20ల సిరిస్ నుంచి సెలక్టర్లు రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.

రోహిత్ శర్మను దాటే అవకాశం
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మను దాటే అవకాశం విరాట్ కోహ్లీకి లభించింది. దీంతో గువహటి వేదికగా ఆదివారం శ్రీలంకతో జరిగే తొలి టీ20లో విరాట్ కోహ్లీ ఒక పరుగు చేస్తే రోహిత్ శర్మ రికార్డుని అధిగమించడంతో పాటు అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అరుదైన రికార్డుని నెలకొల్పుతాడు.

రోహిత్‌తో పాటు పేసర్ మహ్మద్ షమికి విశ్రాంతి
శ్రీలంకతో మూడు టీ20ల సిరిస్‌కు రోహిత్ శర్మతో పాటు పేసర్ మహ్మద్ షమికి కూడా సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్‌కు గాయమవ్వడంతో నవదీప్ సైని, శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వచ్చారు. మరోవైపు గాయం నుంచి కోలుకున్న ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా జట్టులోకి వచ్చాడు. తొలి టీ20 జనవరి 5న గౌహతి వేదికగా ప్రారంభం కానుండగా.. 7వ తేదీన ఇండోర్, 10వ తేదీన పూణె వేదికగా జరగనుంది.

భారత పర్యటనకు శ్రీలంక జట్టు:
లసిత్ మలింగ(కెప్టెన్), దనుష్క గుణతిలక, అవిష్క ఫెర్నాండో, ఏంజెలో మాథ్యూస్, దసున్ శనక, కుశాల్ పెరీరా, నిరోషన్ డిక్వెలా, ధనంజయ డిసిల్వా, ఇసుర ఉదాన, భనుక రాజసక్స, ఒషాద ఫెర్నాండో, హసరంగ, లహిరు కుమార, కుశాల్ మెండిస్, సందకన్, కసున రజిత.

లంకతో టీ20 సిరిస్‌కు టీమిండియా:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శివం దుబే, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీద్ బుమ్రా, నవ్‌ద్రిత్ బుమ్రా మనీష్ పాండే, వాషింగ్టన్ సుందర్, సంజు సామ్సన్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications