Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బిడ్డ దడుసుకున్నట్టున్నాడు: సెలెక్టర్లకు ఆ సందేశాన్ని పంపించిన కింగ్ కోహ్లీ

Virat informed the selection committee that he would be available following the Asia Cup

ముంబై: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉంది. కరేబియన్లపై దండయాత్ర సాగిస్తోంది. వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటోంది. ఇప్పటికే మూడు వన్డే ఇంటర్నేషనల్స్‌ మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో గెలుచుకుంది. అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో ఘన విజయాన్ని అందుకుంది 1-0 తేడాతో ముందంజలో ఉంది. ఈ సిరీస్‌లో రెండో మ్యాచ్ సోమవారం జరుగనుంది. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్‌లోని బస్సరెట్టె స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది.

జింబాబ్వేతో సిరీస్..

జింబాబ్వేతో సిరీస్..

దీని తరువాత భారత జట్టు జింబాబ్వే పర్యటనకు బయలుదేరి వెళ్లనుంది. ఈ నెల 18, 20, 22 తేదీల్లో మూడు వన్డే ఇంటర్నేషనల్స్‌లో జింబాబ్వే జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లన్నీ హరారె స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో షెడ్యూల్ అయ్యాయి. ఈ సిరీస్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ శనివారమే 15 మంది సభ్యులతో కూడిన జట్టును కూడా ప్రకటించింది. ఆ తరువాత ఆసియా కప్ 2022 కోసం సమాయాత్తమౌతుంది టీమిండియా.

టీమ్ ఇదే..

టీమ్ ఇదే..

జింబాబ్వే పర్యటనకు వెళ్లే జట్టుకు శిఖర్ ధవన్ కేప్టెన్‌గా వ్యవహరిస్తాడు. రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్ ఎంపికయ్యారు. రెగ్యులర్ కేప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమి, యజువేంద్ర చాహల్‌కు విశ్రాంతి కల్పించారు సెలెక్టర్లు.

వరుసగా రెండు సిరీస్‌లకు..

వరుసగా రెండు సిరీస్‌లకు..

జట్టును ప్రకటించిన తరువాత విరాట్ కోహ్లీ పేరు ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే అతను వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక కాలేదు. అంతకుముందు ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. భారీ స్కోర్ అందుకోలేక బ్యాట్ ఎత్తేశాడు. పలు విమర్శలకు గురయ్యాడు. ఫామ్ అందిపుచ్చుకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతో క్రికెట్ తాత్కాలికంగా దూరం అయ్యాడు కింగ్ కోహ్లీ.

తాజా అప్‌డేట్..

తాజా అప్‌డేట్..

వరుసగా వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనలకు దూరం కావడం, త్వరలోనే ఆసియా కప్ మెగా క్రికెట్ టోర్నమెంట్ మొదలు కాబోతోండటంతో విరాట్ కోహ్లీకి జట్టులో చోటు దక్కుతుందా? లేదా? అనే హాట్ డిబేట్ సోషల్ మీడియా వేదికగా సాగుతోంది. ఈ పరిణామాల మధ్య విరాట్ కోహ్లీ తాజా అప్‌డేట్ ఇచ్చాడు. ఈ అప్‌డేట్.. పలు రకాల అనుమానాలకు తెర దించినట్టయింది.

ఆసియా కప్ నుంచి అందుబాటులో..

ఆసియా కప్ నుంచి అందుబాటులో..

ఆసియా కప్ టోర్నమెంట్‌ నుంచి ఇక తాను పూర్తిస్థాయిలో జట్టుకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. ఈ మేరకు బీసీసీఐ సెలెక్షన్ కమిటీకి సందేశాన్ని పంపించినట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్ కూడా ముందు ఉండటంతో- ఇక జట్టుకు అందుబాటులో ఉండాల్సిన పరిస్థితిని విరాట్ కోహ్లీ ఎదుర్కొంటోన్నాడని, విశ్రాంతి పేరుతో మ్యాచ్‌లకు దూరమైతే జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదం లేకపోలేదని అతను భావిస్తున్నాడని అంటోన్నారు.

Story first published: Sunday, July 31, 2022, 12:11 [IST]
Other articles published on Jul 31, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+