
హైదరాబాద్: చాహల్ ఇలా మారడానికి కారణం ముమ్మాటికీ విరాట్ కోహ్లీయే అని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెట్టోరీ అని పేర్కొన్నాడు. భారత క్రికెట్‌లో తన స్పిన్ మాయాజాలంతో దూసుకుపోతున్న యజ్వేంద్ర చాహల్ పూర్తిస్థాయిలో రూపాంతరం చెందినట్లు ఆయన పేర్కొన్నాడు. ప్రధానంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చాహల్ తనదైన ముద్రవేశాడని కారణం కోహ్లి అని తెలిపాడు.
'ప్రస్తుతం చాహల్ ఒక ధైర్యవంతమైన బౌలర్ మాత్రమే కాదు. నమ్మశక్యమైన బౌలర్ కూడా. ఐపీఎల్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడటం వల్లే చాహల్ రాటుదేలాడు. ఐపీఎల్లో ఆర్‌సీబీ తరపున ఆడేటప్పుడు అతనికి కోహ్లి ధైర్యంగా బౌలింగ్ అప్పచెప్పడమే కాకుండా ముందుండి నడిపించేవాడు. ఒకానొక దశలో కోహ్లీ, నేనూ కలిసి నేర్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి' అని పేర్కొన్నాడు.
కోహ్లీలోని రెండు కోణాలు నన్ను ఆకట్టుకున్నాయి. మ్యాచ్ గెలిచినప్పుడు ఎంత అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తాడో.. ఓడినప్పుడూ అంతే నిబ్బరాన్ని కలిగి ఉంటాడు. వ్యక్తిగత ప్రదర్శనతో పాటు జట్టు ప్రదర్శన దృష్టిలో ఉంచుకుని ఆడటంలో కోహ్లీకి తనే సాటి' అని కోహ్లీ గురించి చెప్పుకొచ్చాడు.
ఇంకా మాట్లాడుతూ... చిన్నస్వామి స్టేడియం తరహా చిన్న స్టేడియాల్లో బౌలింగ్ చేయడం చాహల్‌కు బాగా కలిసొచ్చింది. దీని వెనుక విరాట్ కృషి ఎంతో ఉంది. దాంతో చాహల్‌లో ఆత్మవిశ్వాసం రెట్టింపు కావడమే కాకుండా ఒక ఎటాకింగ్ బౌలర్‌గా రూపాంతరం చెందాడు. ఈ రోజు మ్యాచ్ విన్నింగ్ బౌలర్‌గా చాహల్ గుర్తింపు సాధించడానికి కోహ్లినే కారణం' అని వెటోరి పేర్కొన్నాడు.
'కొంత కాలంగా రవి చంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు టెస్ట్ క్రికెట్‌ను శాసిస్తున్నారు. అలాగే చాహల్, కర్న్ శర్మ, పీయూష్ చావ్లా ఐపీఎల్‌ను డామినేట్ చేస్తూ.. ఇదే పంథాను కొనసాగిస్తారని భావిస్తున్నాను' అని వెట్టోరి తెలిపాడు. చాహల్ మంచి నైపుణ్యమున్న నేర్పు గల బౌలర్ అతనిని అన్ని సందర్భాల్లో బ్యాట్స్‌మెన్‌లు ఎదుర్కోవడం కష్టం అని వ్యాఖ్యానించాడు.
కోహ్లీ స్వదేశంలోనే గాక, విదేశాల్లోనూ రాణిస్తుండటం హర్షించదగ్గ విషయం అన్నాడు. ఐపీఎల్లో ఆర్సీబీకి కోచ్‌గా వ్యవహరించడం గొప్ప అనుభూతిగా తెలిపిన వెటోరి కోహ్లి సారథ్యంలో జట్టు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించడం చాలా సంతోషంగా ఉందన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.