India vs South Africa: విరాట్ కోహ్లీ నెక్ట్స్ లెవెల్ ప్లేయర్

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తదుపరి స్థాయి ఆటగాడని టీమిండియా యువ పేసర్ దీపక్ చాహర్ కితాబిచ్చాడు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా మొహాలీ వేదికగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ(72 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంతో మ్యాచ్ అనంతరం పేసర్ దీపక్ చాహర్ మాట్లాడుతూ "డెత్ ఓవర్లలో ఇప్పుడు సులభంగా బౌలింగ్ చేయగలుగుతున్నా. అందుకు కారణం పవర్ ప్లేలో ఇద్దురు ఫీల్డర్లు సర్కిల్ బయట ఉండటమే" అని చెప్పుకొచ్చాడు.
"అయితే, పవర్ ప్లే ముగిసిన తర్వాత ఐదుగురు ఫీల్డర్లు సర్కిల్ బయట ఉంటారు. దీంతో డెత్ ఓవర్లలో చాలా సులభంగా బౌలింగ్ చేయగలుగుతున్నా" అని దీపక్ చాహర్ తెలిపాడు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే.

1-0 ఆధిక్యంలో టీమిండియా
దీంతో రెండో టీ20లో టీమిండియా విజయం సాధించడంతో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో మొత్తం నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన దీపక్ చాహర్ రెండు వికెట్లు తీసి 22 పరుగులు సమర్పించుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో దీపక్ చాహర్... ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది
ఐపీఎల్‌లో ఆడటం ద్వారా తనలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగిందని దీపక్ చాహర్ చెప్పుకొచ్చాడు. "మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేస్తే మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఐపీఎల్‌లో ఏదైతే ఆత్మవిశ్వాసం లభించిందో దాని వల్లే ఈరోజు సత్తా చాటగలుగుతున్నా" అని చాహర్ తెలిపాడు. వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌పై కూడా స్పందించాడు.

టీ20 వరల్డ్‌కప్‌కు ఇంకా ఏడాది సమయం
"టీ20 వరల్డ్‌కప్‌కు ఇంకా ఏడాది సమయం ఉంది. దీంతో ప్రతి మ్యాచ్‌ని ఆఖరి మ్యాచ్‌గానే భావిస్తున్నా. ప్రస్తుతం భారత క్రికెట్ అద్భుతమైన స్థాయిలో ఉంది. ఈ జట్టులో చోటు దక్కాలంటే ప్రతి మ్యాచ్‌లోనూ రాణించాలి. ఎందుకంటే ప్రస్తుతం జట్టులో తీవ్రమైన పోటీ నెలకొని ఉంది కాబట్టి" అని దీపక్ చాహర్ తెలిపాడు.

72 పరుగులతో నాటౌట్‌గా కోహ్లీ
దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 72 పరుగులతో నాటౌట్‌గా నిలవడంపై దీపక్ చాహర్ మాట్లాడుతూ "విరాట్ కోహ్లీ తదుపరి స్థాయి ఆటగాడు. నాకు ఇప్పటికీ అర్ధం కావడం లేదు. విరాట్ భయ్యా ఇలా వరుస పెట్టి ఎలా పరుగులు సాధిస్తున్నాడో. అది కూడా నిలకడగా. అతడు నెక్ట్స్ లెవెల్ ప్లేయర్" అని ప్రశంసల వర్షం కురిపించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications