న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్లలో చాలా మందికి ముద్దుపేర్లు ఉన్న విషయం తెలిసిందే. అయితే అవి ఎలా వచ్చాయనే విషయా మాత్రం అందరికీ తెలియకపోవచ్చు. ఈ క్రమంలో టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తనకు వచ్చిన ముద్దుపేరు(నిక్‌నేమ్) గురించి ఆసక్తికర విషయాలు వెల్లించాడు.
కోహ్లీ తోపాటు ధోనీ, ఇతర ఆటగాళ్లు కూడా తమ ముద్దు పేర్లను గురించిన కథలను తెలిపారు. కాగా, మహీ, చీకూ, సోను, అజ్జు, షానా ఇలా టీమిండియా క్రికెటర్లందరికీ ముద్దుపేర్లు ఉన్నాయి.
కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తనకు 'మహీ' అనే ముద్దుపేరు ఉందని, తన పేరును తన పూర్తి పేరును కట్‌చేసి షార్ట్‌కట్‌లో పిలుస్తుండటంతో ఈ నిక్‌నేమ్ వచ్చిందని చెప్పాడు.

ఇక విరాట్ కోహ్లి తన ముద్దుపేరు 'చీకూ' అని చెప్పాడు. చిన్నప్పుడు తాను పెద్ద చెవులతో బొద్దుగా ఉండేవాడినని, దీనికితోడు చిన్నగా కటింగ్ చేయించుకునేవాడినని, చంపక్ కామిక్స్‌లో 'చీకూ' కుందేలులా ఉండటంతో తనకు ఢిల్లీలో ఓ కోచ్ ఈ ముద్దుపేరు పెట్టాడని వెల్లడించాడు.
Mahi, Cheeku, Sonu, Ajju, Shana - the story behind the nicknames of #TeamIndia members http://www.bcci.tv/videos/id/2052/know-your-stars-the-story-behind-nicknames
Posted by Indian Cricket Team onSunday, March 6, 2016
అలాగే యువరాజ్ సింగ్ తన ముద్దుపేరు 'యూవీ' అని, హర్భజన్‌సింగ్ తన నిక్‌నేమ్ 'భజ్జీ' అని చెప్పగా.. రవీంద్ర జడ్జేజా తన ముద్దు పేరు 'జెడ్డూ' అని తెలిపారు. రోహిత్ శర్మ తన నిక్‌నేమ్ 'షానా' అని, సురేశ్ రైనా తన సరదా పేరు 'సోనూ' అని వెల్లడించారు. ఇంకా మిగతా టీమిండియా క్రికెటర్లు కూడా తమ ముద్దు పేర్లను తమ తమ స్టైల్లో వెల్లడించారు. కాగా, ఈ వీడియోను బిసిసిఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది.