For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆకాశాన్ని తాకేలా నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్‌లోకి కోహ్లీ-అనుష్క

కోహ్లీ-అనుష్క మంగళవారం ముంబైలోని వర్లీ ప్రాంతంలో ప్రత్యక్షం కావడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఓంకార్ బిల్డర్స్ ’1973 వర్లీ’ పేరుతో నిర్మిస్తున్న అత్యంత విలాసవంతమైన అపార్ట్ మెంట్లను వీరిద్దరూ పరిశీలి

By Nageshwara Rao

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా కనిపించడం లేదు. అయితే ఈ ప్రేమజంట బయట ఎక్కడ కనపించినా మీడియాలో మాత్రం వివిధ రకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ ప్రేమపక్షులు మంగళవారం ముంబైలోని వర్లీ ప్రాంతంలో ప్రత్యక్షం కావడంతో మరోసారి వార్తల్లో నిలిచారు.

ఓంకార్ బిల్డర్స్ '1973 వర్లీ' పేరుతో నిర్మిస్తున్న అత్యంత విలాసవంతమైన అపార్ట్ మెంట్లను వీరిద్దరూ పరిశీలించారు. ఆకాశాన్ని తాకేలా నిర్మిస్తున్న ఈ అపార్ట్‌మెంట్లు సిద్ధమైన తర్వాత ఈ జోడీ ఇక్కడిక మకాం మారుస్తారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరికొన్ని మీడియా ఛానెళ్లు ఇంకో అడుగు ముందుకేసి పెళ్లైన తర్వాత ఇక్కడే కాపురం పెడతారని వార్తలను ప్రసారం చేశాయి.

Virat and Anushka visit his sky bungalow, couple moving in together?

అయితే ఈ వార్తలపై ఈ ప్రేమజంట ఇప్పటివరకు కామెంట్ చేయకపోవడం విశేషం. ఇటీవలే వీరిద్దరూ క్రిస్టమస్, నూతన సంవత్సర వేడుకలను ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్‌లో జరుపుకున్న సంగతి తెలిసిందే. అప్పుడు కూడా మీడియా అత్యుత్సాహం చూపించిన సంగతి తెలిసిందే.

చాలా కాలంగా ప్రేమించుకుంటున్న ఈ జోడీ ఉత్త‌రాఖండ్‌లోని న‌రేంద్ర‌న‌గ‌ర్ ఆనందా హోటల్‌లో ఈ ఇద్ద‌రి నిశ్చితార్థం జరగనున్నట్టు క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. కోహ్లీ-అనుష్క ఎంగేజ్‌మెంట్‌కు ప్ర‌ముఖులు హాజ‌ర‌వుతార‌ని చెప్పుకున్నారు. మీడియాలో వచ్చిన వార్తలపై కోహ్లి స్వయంగా వివరణ ఇవ్వడంతో ఊహాగానాలకు తెర పడింది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+