జహీర్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో కోహ్లీ-అనుష్క డ్యాన్స్ (వీడియో)
హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్, బాలీవుడ్ నటి సాగరిక ఘట్కేల వివాహం నవంబర్ 23 (గురువారం) ముంబైలోని రిజస్టర్ ఆఫీసులో అతికొద్దిమంది అతిథుల సమక్షంలో సింపుల్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లి అనంతరం వీరిద్దరూ బంధువులకు, స్నేహితులకు ప్రత్యేక విందు కార్యక్రమాలను ఇస్తున్న సంగతి తెలిసిందే.

తాజ్ లాండ్స్‌లో వెడ్డింగ్ రిసెప్షన్
ఇందులో భాగంగా జహీర్-సాగరికల జోడీ సోమవారం ముంబైలోని తాజ్ లాండ్స్‌లో వెడ్డింగ్ రిసెప్షన్ పేరిట క్రికెటర్లతోపాటు మిగతా సెలబ్రిటీలందరికీ గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ జోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సోషల్ మీడియాలో వీడియో వైరల్
అంతేకాదు కొత్త జంటతో కలిసి వీరిద్దరూ డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ కార్యక్రమానికి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌తో పాటు మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, ఆశిష్ నెహ్రా, అజిత్ అగార్కర్ తదితరులు హాజరయ్యారు.

సానియా మిర్జా సందడి
వీరితో పాటు ప్రస్తుత వెటరన్ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు. భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా కూడా ఈ కార్యక్రమంలో సందడి చేశారు.

పార్టీలో హుషారెత్తించిన కోహ్లీ
నాగ్ పూర్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించడంతో పాటు కోహ్లీ డబుల్ సెంచరీ సాధించడంతో కోహ్లీ పార్టీలో హుషారెత్తించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications